చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే..!


ఏ అంశం మీద అయినా సుదీర్ఘంగా ఉపన్యసించి, తిమ్మిని బమ్మి చేయటంలో చంద్రబాబుని మించిన నేర్పరి ఉండరు. శాసనమండలి, సభ, ఎల్పీ సమావేశాల్లో చంద్రబాబు ఈ విషయాన్ని బాగా రుజువు చేసుకొన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద చంద్రబాబు చాలా నీతి వాక్యాలు ప్రబోధించారు.

కాల్ మనీ సెక్సు రాకెట్ విషయంలో దోషుల్ని వదిలేది లేదని, కఠినంగా శిక్షించేలా చూస్తామని పదే పదే చెప్పుకొన్నారు. వాస్తవానికి ఈ కేసులో దోషులు ఎవరు అనేది సుస్పష్టం. బహిరంగంగా తెలిసినా పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డీ వ్యాపారులు అందరినీ ఇందులోకి లాగుతున్నారు. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ల మీద కేసులు కట్టించి వేధించే పనిని ముమ్మరంచేశారు. తప్పితే తెలుగుదేశం నాయకులు పీకల్లోతు మునిగిన కేసులో తేలికపాటి శిక్షలుపడే కేసుల్ని మాత్రమే పెట్టించారు.

ఇసుక మాఫియా గురించి చెబుతూ మహిళా తహశీల్దార్ వనజాక్షి పరిధి దాటి ప్రవర్తించిందని ముద్ర వేశారు. ఇసుకను అడ్డగోలుగా తవ్వుకొంటున్న తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ... ఒక ఎమ్మెల్యేగా చైతన్య వంతంగా పనిచేశారని కితాబు ఇచ్చారు. అంటే చట్ట ప్రకారం ప్రభుత్వం వారి సహజ సంపదను కాపాడేందుకు ప్రయత్నిస్తే అది తప్పని, ఆ నెపంతో ఇసుకలోకి దొర్లించి కొట్టించిన ఎమ్మెల్యే చైతన్యవంతుడని కితాబు ఇచ్చారు. 

రాజధాని వ్యవహారంలో బురద జల్లే పనులు చేస్తున్నారని మరో ప్రకటన గుప్పించారు. అసలు తెలుగువారి భూముల్ని సింగపూర్ కంపెనీలకు అడ్డగోలుగా అప్పగిస్తున్నది చంద్రబాబు. ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టి విదేశీ సంస్థలకు సర్వం దోచిపెడుతున్నది కాకుండా ఇది సరైనది కాదు అని చెబుతున్నందుకు ప్రతిపక్షాల మీద బురద జల్లేందుకు శక్తివంచన లేకుండా క్రషి చేస్తున్నారు.

Back to Top