చివరికి న్యాయమే గెలిచింది

హైదరాబాద్, 23 సెప్టెంబర్ 2013:

చిట్ట చివరికి న్యాయమే గెలిచింది. కాంగ్రెస్, టిడిపిలు కలిసి కుట్ర చేసి, సిబిఐని ఉసిగొల్పి అన్యాయంగా 16 నెలల పాటు జైలులో నిర్బంధించినా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప లోక్‌సభ సభ్యుడ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పక్షానే న్యాయం నిలిచింది. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ కోర్టు సోమవారంనాడు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీనితో 484 రోజులుగా చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్న శ్రీ జగన్‌ మంగళవారం మధ్యాహ్నానికి ప్రజల మధ్యకు రానున్నారు. విచారణ పేరుతో శ్రీ జగన్‌ను సిబిఐ హైదరాబాద్‌ పిలిపించి 2012 మే 27న అరెస్టు చేసింది.

ఎన్ని రాజకీయాలు, ఎన్ని కుట్రలు చేసినా ఆలస్యంగా అయినా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైంది. న్యాయమే గెలిచింది. భారత న్యాయవ్యవస్థపై తమకు అపార నమ్మకం ఉందని, దేవుడు తమ పక్షానే నిలుస్తాడని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ చెబుతూ వచ్చారు. అభిమానులు, కార్యకర్తలు కూడా అదే చెప్పారు. చివరకు వారు ఆశించినదే జరిగింది. నేరం రుజువు కాకుండానే శ్రీ జగన్ను 48‌ రోజులు జైలులో ఉంచారు. ఆయనకు బెయిల్ రాకుండా ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం కల్పించారు. అడ్డుకుంటూ వచ్చారు. ఎంతకాలం జైలులో ఉంచగలరు? దేవుడు‌ శ్రీ జగన్ పక్షాన నిలిచాడు. న్యాయం ఆయన పక్షానే ఉంది. అందుకే ఆయన బయటకు రానున్నారు. జనం కూడా శ్రీ జగన్మోహన్‌రెడ్డి పక్షానే ఉన్నారు. రాబోయే ఎన్నికలలో అది కూడా తేటతెల్లం అవుతుంది. జైలులో ఉన్నా శ్రీ జగన్మోహన్‌రెడ్డి జనం గురించే ఆలోచిస్తున్నారు. జనం కూడా యువనేత బయటకు రావాలని ప్రార్ధనలు చేశారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలుకు పంపడం రాజకీయ వేధింపులలో భాగమేని అందనికి తెలిసిన విషయమే. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల కోసం శ్రీ జగన్ దీక్షలు చేసి, పోరాడి  ప్రజలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. పోరాటాలు, ఉద్యమాలతో ‌ఎనలేని ప్రజాస్పందనను కూడగట్టుకున్నారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలో చైతన్యం తీసుకువచ్చారు. ఆయన రాజకీయాలలోకి వచ్చిన అనతి కాలంలోనే జననేతగా ఎదిగారు. అన్ని ప్రాంతాలలో అన్ని వర్గాల ప్రజల నుంచి శ్రీ జగన్కు ‌వచ్చిన అపూర్వ ఆదరణ, ఆయన పాల్గొన్న బహిరంగ సభలకు వచ్చే జనవాహిని చూసి తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ గల నేత యువకులలో గానీ, సీనియర్లలో గాని మరొకరు లేరని తేల్చేశారు.

శ్రీ జగన్‌కు లభిస్తున్న అనూహ్యమైన ప్రజాదరణను చూసి కాంగ్రెస్‌, టిడిపిలు తట్టుకోలేకపోయాయి. ఓర్వలేకపోయాయి. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోవడం ఖాయమని వాటికి అర్దమైపోయింది. దాంతో ఆ రెండు పార్టీలు బతికి బట్టకట్టడానికే శ్రీ జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. రెండూ ఏకమయ్యాయి. కుట్ర పన్నాయి. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబిఐ శ్రీ జగన్ ఆస్తుల కేసు విషయంలో కోర్టు ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే ఆగమేఘాల‌మీద రంగంలోకి దిగింది. ఇతర రాష్ట్రాల నుంచి 80 బృందాలను రప్పించింది. శ్రీ జగన్ ఇంటిపైన, సంస్థలపైన దాడులు చేసి, సోదాలు చే‌సింది.

గత సంవత్సరం మే 27న శ్రీ జగన్ను అరె‌స్టు చేసిన సిబిఐ దర్యాప్తు పూర్తిచేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చేసింది. చార్జిషీట్లు దాఖలు చేయడంలో అంతకంటే ఎక్కువ జాప్యం చేశారు. శ్రీ జగన్ను అరె‌స్టు చేసిన 16 నెలల వరకు  ఛార్జిషీట్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. దర్యాప్తు ప్రారంభించడంలో చూపిన వేగం, చురుకుదనం పూర్తిచేయడంలో చూపలేదు. అరెస్టు చేసిన 90 రోజుల్లోగా ఛార్జిషీ‌ట్ దాఖలు చేయాలి. ఆ లో‌గా దర్యాప్తు పూర్తిచేసి ఛార్జిషీట్ దాఖలు చేయ‌కపోతే తప్పనిసరిగా బెయిల్ మంజూరు చేయాలన్న నిబంధన చట్టంలో ఉంది. అయినా‌ శ్రీ జగన్కు బెయి‌ల్ రాకుండా అడ్డుపడ్డారు. ఇదంతా‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకేనని అందరికీ తెలిసిన విషయమే.

మహానేత డాక్ట‌ర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత పరిస్థితుల ప్రభావంతో అనివార్యంగా రాజకీయంగా దూసుకువచ్చిన యువకెరటం‌ శ్రీ జగ‌న్మోహన్‌రెడ్డి. శ్రీ జగన్‌ సోదరి శ్రీమతి షర్మిల అన్నట్లు జైలులో ఉన్నా సింహం సింహమే. ఆ మహానేత మోముపై ఏ విధంగా చిరునవ్వు తాండవిస్తుందో, జైలులో ఉన్నా శ్రీ జగన్ మోముపై అదే చిరునవ్వు కనిపించింది. వై‌యస్ఆర్ వలెనే శ్రీ జగన్ కూడా తమ కష్టాలు తీరుస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top