జగన్ కోసం సంఘీభావ పాదయాత్రలు


సంఘీభావం ఎందుకు తెలుపుతారు? తమ ఆలోచనలకు దగ్గరా ఉంటే తెలుపుతారు. తమకు సాయం చేసే మనిషని తెలిస్తే తెలుపుతారు. వాస్తవాలను విప్పి చెబుతుంటే సంఘీభావం ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు వివిధ వర్గాల ప్రజలు వైఎస్ జగన్ కు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అది కూడా మాటల్లో కాదు, ఆ యువనేత ఎంచుకున్న మార్గంలోనే పాదయాత్ర చేసి మరీ తమ మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాల ప్రజలు సంఘీభావ పాదయాత్రలు చేపట్టారు. స్థానికంగా ఆలయాల్లో జగన్ సిఎమ్ కావాలని కోరుతూ  పూజలు జరిపించారు. 3000 కి.మీలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో పలుచోట్ల అభిమానులే కేకులు కోసి పండుగ జరుపుకున్నారు. ప్రజలకు స్వీట్లు, కేకులు పంచారు. వాహనాలతో ర్యాలీలు చేసారు. చాలా చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు  పాదయాత్రగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ నాయకుడందించిన స్ఫూర్తితో పాదయాత్రలు చేస్తున్నామని అంటున్నారు yటటఛిp నేతలు. 
ఎందరో అభిమానులు జగన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు జరిపారు. మహానేతను తలచుకుని నివాళులర్పించారు. రాష్ట్రం కోసం అలుపు లేకుండా సాగుతున్న ఆ పాదయాత్రికుని కోసం ప్రజలూ నడిచారు. తమ కోసం ఓ నాయకుడు పడే కష్టానికి మద్దతు పలికారు. జగన్ పాదయాత్ర జనం కోసం. జనం పాదయాత్ర జగన్ కి మద్దతీయడం కోసం అంటూ నినాదుల చేసారు. కాబోయే సిఎమ్ జగనే అంటూ మనసారా నమ్మిన తెలుగు ప్రజల ఆశీర్వాదానికి ప్రతిరూపమే ఈ సంఘీభావ పాదయాత్రలు అంటున్నారు రాజకీయ నిపుణులు. 
 
Back to Top