ఛీ..ఛీ చింతమనేని

వివాదాస్పద అధికార తెలుగుదేశం
పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. వైసీపీ నేత మేడికొండ
కృష్ణపై దాడి చేసి గాయపరిచాడు. పెదవేగి మండలానికి చెందిన మాజీసర్పంచ్ మేడికొండ కృష్ణ
గారమీద చింతమనేని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు చింతమనేనిపై కిడ్నాప్, హత్యాయత్నం సెక్షన్లకింద
నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసారు.

మరో దౌర్జన్యం

పెదవేగి మండలం లక్ష్మీపురం
వద్ద మట్టి మాఫియాను అడ్డుకున్న వైసీపీ నాయకులు మేడికొండ కృష్ణారావుపై దౌర్జన్యం చేసి, ఆయన్ను చంపడానికి ప్రయత్నించారు
చింతమనేని అనుచరులు. పోలవరం కుడి కాలువ మట్టిని చింతమనేని అతని అనుచరులు అక్రమంగా దోపిడీ చేయడాన్ని
అడ్డుకుని, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసిన కారణంగా వైసీపీ నేత మేడికొండ కృష్ణ పై
అతి కిరాతంగా దాడి చేసి, చంపేందుకు కూడా ప్రయత్నించారు. దీనిపై స్థానిక ప్రజలు, వైసీపీ కార్యకర్తలు
తీవ్రంగా స్పందించారు. చింతమనేని దాష్టీకాలకు ప్రభుత్వంఅడ్డుకట్ట వేయాలని, ఎమ్మెల్యే హత్యారాజకీయాలు
నశించాలని పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసారు. రౌడీషీటర్ లా ప్రవర్తిస్తూ
తన అక్రమాలకు అడ్డొచ్చిన వారిని చంపేందుకు కూడా వెనుకాడని చింతమనేనిని అరెస్టు చేయాలంటూ
పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో పోలీసులు తప్పని సరి పరిస్థితుల్లో చింతమనేనిపై
కేసు నమోదు చేసారు.

ఛీకొడుతున్న ప్రజలు

చింతమనేని పేరు చెబితే
పశ్చిమగోదవరి జిల్లానే కాదు రాష్ట్రమంతా ఛీ కొడుతుంది. అవును నేను రౌడీనే అని
పబ్లిక్ గా చెప్పుకునే అహంకారి చింతమనేని. ప్రజలు, పోలీసులు, మీడియా, అధికారులు అన్న బేధం లేకుండా అందరినీ ఇష్టం వచ్చినట్టు
బూతులు తిట్టడం అతడి లక్షణం. చివరకు మహిళా అధికారణినిని కూడా జుట్టుపట్టుకుని ఈడ్చిన
చరిత్ర ఇతడిది.

గతంలోనూ ఇంతే

అక్రమ మైనింగ్ తవ్వకాలు
జరుగుతున్న చోట వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేసారు. విజిలెన్స్ అధికారులపై
కూడా విరుచుకుపడ్డాడు చింతమనేని. నాకు సంబంధించిన వాహనాలనే సీజ్ చేస్తారా అంటూ వారిని నానా దుర్భాషలాడాడు. అనుచరులతో దాడి కూడా
చేయించబోయాడు. ఈ పరాభవంతోఆగ్రహించిన 
అధికారులు అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు. దీనిపై విజిలెన్స్ అధికారులకు
వివరణ ఇవచ్చేందుకు వచ్చిన సందర్భంలోఎమ్మెల్యే రసాభాసే చేసాడు. చింతమనేని అనుచిత ప్రవర్తనను
వీడియో తీయబోయిన మీడియాను కూడా రెచ్చిపోయి బూతులు తిట్టాడీ ప్రబుద్ధుడు. తన వాహనంపై ఎర్రటి పెద్ద
అక్షరాలతో తన పేరును రాసుకుని నో కాంప్రమైజ్ అనే కొటేషన్ పెట్టుకుని మరీ తిరుగుతాడు
చింతమనేని. రాష్ట్రం మొత్తాన్నీ తన రౌడీయిజంతో కంట్రోల్ చేసేందుకు ప్రయత్నింస్తుంటాడు. ఇంతజరుగుతున్నా చంద్రబాబు
ఈ ఎమ్మెల్యేపై కనీసం క్రమశిక్షణా చర్యలు ఐనా తీసుకోలేదు. పోలీస్ స్టేషన్ లో నమోదైన
కేసుల దర్యాప్తు ఏమౌతోందో తెలియదు.

 

Back to Top