అంతర్జాతీయ వై‘భాగ్యం’ ఇదేనా..?

– తొలకరి రాకుండానే మునిగిన అసెంబ్లీ 
– సెంమీ వర్షానికే కూలిన గోడలు 
– కోట్ల ఖర్చుతో నాసిరకంగా నిర్మాణాలు 
– చదరపు మీటర్‌కు రూ. 10 వేల వ్యయం 
– రూ. 900 కోట్లు గోదార్లో కలిసినట్టేనా
– చిల్లుల కొంప కట్టి చూపించిన సింగపూర్‌ కంపెనీ 

‘ఇది ఒక చరిత్ర.. ఎంతో మంది వ్యతిరేకించారు.. అయినా వెనక్కి తగ్గలేదు.. రికార్డు స్థాయిలో పూర్తిచేశా. నా పట్టుదలను చూసి అందరూ నివ్వెరపోయారు. ఇప్పటికే ఎంతో చేశాను. ఇంకా చేస్తాను. 2050 వరకు అధికారం కట్టబెట్టండి. 2022 కి దేశంలోనే ఏపీని నెంబర్‌ వన్‌ చేస్తా.. 2050 నాటికి ప్రపంచంలో నెంబర్‌ వన్‌ చేస్తా. ఒక విజన్‌తో ముందుకు పోతున్నా. ’ పరిచయం అక్కర్లేని ఈ ప్రసంగం గురించి.. ఎవరు మాట్లాడారని తడుముకోవాల్సిన పనిలేదు. పబ్లిసిటీ ప్రేమికుడు చంద్రబాబు గారే. ఏ చిన్న కార్యక్రమమైనా అందులో ముందుగా తన గురించి ఒక రీల్‌ ఉండాల్సిందే. అయ్యవార్లయినా పెళ్లిళ్లు, తద్దినాలకు మంత్రాలు మార్చి చదువుతారు. కానీ చంద్రబాబు మాత్రం కార్యక్రమం ఏదైనా అదే మంత్రాలు చెప్పిందే చెప్పి.. ముందుకీ వెనక్కీ మార్చి మార్చి చెప్పడం చూసి జనాలే పారిపోతుంటారు. అయితే తెలుగు తమ్ముళ్లు దీనికి పెద్ద విరుగుడు కనిపెట్టారు. మీటింగులకు వచ్చిన జనాలు పారిపోకుండా గేట్లు వేసేస్తున్నారు. అయినా కూడ బాబు చెప్పే సోది తట్టుకోలేక మహిళలు కూడా గేట్లు దూకి పారిపోతున్నారు. సింగపూర్, జపాన్ అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కట్టే నిర్మాణాలు చూస్తే సెంటీ మీటర్‌ వర్షానికే చిత్తడయిపోతున్నాయి. 
 
సెం.మీ వర్షానికే నిలవలేని అంతర్జాతీయ అసెంబ్లీ 
అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు ప్రసంగం వింటే అమ్మో.. అంత గొప్పగా నిర్మించారా అన్నట్టుంది. ప్రతిసారీ అలాగే చెప్పడం బాబుకు అలవాటే అనుకోండి. తీరా ఇప్పుడు చూస్తే సెంటీ మీటర్‌ వర్షపాతానికే ప్రతిపక్ష నాయకుడి కార్యాలయంలో వరదలు వచ్చాయి. బక్కెట్‌లతో నీటిని తోడిపారబోస్తున్నారు. మనవాళ్లు మురికివాడలే కడతారంటూ హేళన చేస్తూ చంద్రబాబు సింగపూర్‌ కంపెనీలకు ఇచ్చిన అసెంబ్లీ భవనం ఇప్పుడు చిన్నపాటి వర్షానికే తడిసి ముద్దయింది. చదరపు మీటర్‌కు వెయ్యి రెండు వేలతో పూర్తయ్యే నిర్మాణాన్ని దాదాపు పదివేలకు పైగా ఖర్చు చేసి ఇలాంటి చిల్లుల కొంప కట్టేశాడు. మన ఇంజినీర్ల మీద నమ్మకం లేక సింగపూర్‌ నుంచి అరువు తెచ్చుకున్న మేధావులు కట్టిన అంతర్జాతీయ భవనం చూసి జనం పగలబడి నవ్వుతున్నారు. ఇప్పటికే 18 దేశాలు తిరిగి పరిశోధించి రికార్డు స్థాయిలో పూర్తి చేసిన అద్భుత నిర్మాణం నవ్వుల పాలైంది. 

ఇప్పుడెందుకు రహస్యం..
చంద్రబాబు తీర్చిదిద్దిన అంతర్జాతీయ నిర్మాణం తాలూకూ ఘన చరిత్ర ఇప్పటికే దేశమంతా తెలిసిపోయింది. ఇంకా ఏం దాచేద్దామనోగానీ మీడియాను కూడా అనుమంతించరట. చిన్నపాటి వర్షానికే మునిగి పోయిన అసెంబ్లీ వైభోగాన్ని చూద్దామని వెళ్లిన ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించకుండా మసి పూసి మారేడుకాయ చేద్దామని పథకం రచించారు. మీడియాను అనుమతించకపోవడం వెనుక కారణం కూడా అదే. ఇప్పటికే పచ్చ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తేనే చంద్రబాబును కాపాడేందుకు వాళ్లు పడే తాపత్రయం తెలిసిపోతుంది. నాడు వైయస్‌ఆర్‌ అధికారంలో ఉంటే ప్రతి చిన్నదానికీ కెమెరాలతో వెళ్లి హడావుడి చేసేసే పచ్చ మీడియా బాబు బాగోతాలను మాత్రం బ్రహ్మాండంగా దాచిపెడుతోంది. అంతర్జాతీయ నిర్మాణం అని బాబు ఊదరగొట్టిన అసెంబ్లీలో.. అదీ సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకుడి కార్యాలయంలో జోరున కుండపోతగా నీరు కారుతుంటే దాన్ని బయటకు పొక్కనీయకుండా చేసేందుకు బాబు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు . అమెరికాలో ట్రంప్‌ మీడియాను వెళ్లగొట్టాడని రోజంతా విజువల్స్‌తో చంపేసిన పచ్చ మీడియా ఇక్కడ చంద్రబాబు తోటి జర్నలిస్టులను అనరాని మాటలతో స్థాయి దిగజార్చుకుని మరీ మాట్లాడుతుంటే వారికి చీమ కుట్టినట్టయినా ఉండదు. అసెంబ్లీలోకి నీళ్లు రావడంపైన సీఆర్‌డీఏ అధికారులు ఇస్తున్న వివరణలు చూస్తుంటే లోపలేదో తేడా జరిగే ఉంటుందని అనుమానం వచ్చి తీరుతుంది. కిటికీలు తెరిచి ఉండటం వల్లే నీళ్లొచ్చాయని ఒకసారి చెబితే.. ఇటీవల మరమ్మతుల నిమిత్తం పైనుంచి ఒక పైపును దించడం వలనే అక్కడ లీకైందని మరోసారి.. ఫాల్‌ సీలింగ్‌లో లైటు దగ్గర చిన్న లీకేజీ కారణంగా జరిగిందని ఇంకోసారి.. ఇలా క్షణానికి ఒకసారి చెప్పడం చూస్తుంటే ఏమనుకోవాలి. అది చిన్న సమస్యే అయినప్పుడు మీడియా వస్తే భయం దేనికి. సాదరంగా పిలిచి అన్నీ చూపించొచ్చు కదా. దేశం మొత్తం వీడియోలు వైరల్‌ అయిన తర్వాత కూడా ఏం దాచేద్దామని బాబు ఈ ప్రయత్నం. మరమ్మతుల కోసం మళ్లీ కోట్లు ఖర్చు చేసి అప్పుడు మీడియాను పిలిచి అంతా ప్రతిపక్షాల ఆరోపణలే అని చెబుదామని కాబోలు వారి ప్రయత్నం. 
Back to Top