వ్యవసాయం అంటే దండగ అన్నది చంద్రబాబు గట్టిగా నమ్మే సూత్రం. అందుకే ఆయన ఇదే సూత్రాన్ని తన సహచరులు, అనుచరులకు నూరిపోస్తారు.

రైతుల ఆత్మహత్యల మీద హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. దీని మీద వివరణ కావాలని న్యాయస్థానం రెండు తెలుగు రాష్ట్రాల్ని ఆదేశించింది. ఈ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తమ వాదనల్ని పొందు పరిచి ప్రభుత్వ న్యాయ వాది ద్వారా న్యాయస్థానానికి విన్నవించింది. రైతుల ఆత్మహత్యల మీద ప్రభుత్వ వైఖరి, వ్యవసాయానికి అందిస్తున్న సాయం మొదలైన వివరాల్ని తెలియపరిచింది. అయితే, తర్వాత క్రమంలో అప్ డేట్ సమాచారం అందించాల్సిన ఆంధ్రప్రదేశ్ మాత్రం బాధ్యతను గాలికి వదిలేసింది.

న్యాయస్థానం ఇదే విషయాన్ని నేరుగా ప్రశ్నించింది. వాస్తవానికి రైతుల ఆత్మహత్యల మీద ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, ప్రజా సంఘాలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాల్ని పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వ అధినేత బాటల్లోనే ప్రభుత్వ న్యాయవాదులు నడిచారు. కనీసం రైతు ఆత్మహత్యలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వనేలేదు. దీంతో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రైతుల విషయంలో ఇలాగేనా వ్యవహరించేది అంటూ సూటిగా ప్రశ్నించింది. విచారణ సమయంలో ప్రభుత్వ వైఖరి ఇలా ఉంటే, దీన్ని బట్టి రైతు సంక్షేమం మీద మీ చిత్తశుద్ది ఏమిటో అర్థం అవుతుంది. అని ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు చేత అక్షింతలు వేయించుకొంటే తప్ప ఈ ప్రభుత్వంలో కదలిక లేదని అర్థం అవుతోంది.