అసలు రంగు బట్టబయలు..!కేసుల మాఫీ కోసం డ్రామా<br/>ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎలుగెత్తి చాటుతుండడంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని చంద్రబాబు...ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శకుని కుట్రలు పన్నుతున్నాడు. మాయమాటలతో మోసగిస్తూ ఆంధ్రరాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టించేందుకు ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తూనే ఉన్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజాసమస్యలను తుంగలో తొక్కేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు . రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ప్రజలనోట్లో మట్టి కొట్టారు..!రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలు, ప్రాణాలు పణంగా పెట్టి చేసిన దీక్షను చంద్రబాబు కుయుక్తులు పన్ని అడ్డుకున్నసంగతి తెలిసిందే. ఐతే, హోదాపై దృష్టి మరల్చేందుకే చంద్రబాబు శంకుస్థాపన పేరుతో నానా ఆర్భాటం చేశారని ప్రజలంతా గుర్తించారు. అమరావతి నిర్మాణానికి మట్టి, నీళ్లు అంటూ ..చివరకు రైతుల నోట్లో మట్టిగొట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధాని వస్తున్నారు అది ఇస్తారు, ఇదీ చేస్తారని ప్రగల్భాలు పలికి ఉసూరుమనిపించిన చంద్రబాబు డొంకతిరిగుడు మాటలను పసిగట్టారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటన చేస్తారని ఆశించిన ప్రజల ఆశలమీద నీళ్లు చల్లారు. హోదాపై స్పష్టత ఇవ్వకుండా ప్రజల కళ్లలో దుమ్ముకొట్టి గాల్లో తేలిపోయారు. <br/>కేసుల కోసమే తతంగమంతా..!విదేశీ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఢూం ఢాం అని ఊదరగొట్టి... బ్రీఫుడ్ మీ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఆడిన బాగోతం గుట్టు రట్టయ్యింది. అసలు చంద్రబాబు శంకుస్థాపన కార్యక్రమం చేసిందే..ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకేనన్న సంగతి రూడీ అయిపోయింది. ఆహ్వానం పేరుతో అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ ఇంటికెళ్లి కాళ్లు పట్టుకున్న చంద్రబాబు...శంకుస్థాపన అనే ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాడని అందరికీ అర్థమైపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి, రాజభోగాల్లో తూలుతూ.... మరిన్ని కుట్రలు, పన్నాగాలకు పదునుపెడుతున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.