రాజ్యాంగాతీతుడు


చంద్ర‌బాబు స‌ర్వ వ్య‌వ‌స్థ‌ల‌కూ అతీతుడు. రాజ్యాంగ వ్య‌తిరేకి. చ‌ట్ట వ్య‌తిరేకి. ఇది ప్ర‌తి రాజినీతిజ్ఞ‌డూ అంటున్న మాట‌లు. చంద్ర‌బాబు రాజ్యాంగం ప్ర‌కారం ఎప్పుడూ  రాష్ట్రాన్ని పాలించ‌లేదు. ఆయ‌న‌రాజ్యంగం వేరు. ఆయ‌న చ‌ట్టాలూ వేరు. బాబు కోట‌రీకి అవి చుట్టాలు.

రాజ్యంగానికి సంబంధం లేకుండా చంద్ర‌బాబు ప‌రిపాల‌న చేస్తున్నాడు. 2014లో అధికారంలోకి వ‌చ్చాక అమ‌రావ‌తి లో బాబు చేసిన 33వేల ఎక‌రాల భూ సేక‌ర‌ణ రాజ్యాంగంలోని 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం కాదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న 23మంది ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలోకి తీసుకుంది కూడా రాజ్యాంగ బ‌ధంగా కాదు. పార్టీ ఫిరాయింపుల చ‌ట్టాన్ని కూడా అతిక్ర‌మించి ఈ రాజ‌కీయ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించాడు బాబు. రాజ‌ధాని నిర్ణ‌యం కానీ, రాష్ట్రం పేర చేస్తున్న అప్పులు కానీ ఏవీ రాజ్యాంగ బ‌ద్ధంకాదు. 

 ప్ర‌తి రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లోనూ చంద్ర‌బాబు త‌న వాళ్ల‌ను నియ‌మించుకున్నాడంటారు విశ్లేష‌కులు. ద‌ర్యాప్తు సంస్థ‌లైనా, అత్యున్న‌త న్యాయ‌స్థానమైనా, చివ‌ర‌కు జాతీయ పార్టీల‌లో నైనా బాబు త‌న‌వాళ్ల‌ను బంట్లుగా పెట్టుకుని వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేస్తున్నాడ‌న్న‌ది ప‌చ్చి నిజం. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను త‌న‌కు న‌చ్చిన‌ట్టు వాడుకునేందుకు బాబు ముఖ్య‌మంత్రి అయిన‌ తొలినుంచీ త‌న వాళ్ల‌ను నియ‌మించుకున్నాడు. అందుకే చంద్ర‌బాబు అవినీతిపై ఎవ‌రు ఎంత గొంతు చించుకున్నా బాబుకు బెంగ లేదు భ‌యం క‌ల‌గ‌లేదు. 

మ‌రి అలాంటి చంద్ర‌బాబు నేడు సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా, ద‌ర్యాప్తులు చేయ‌కుండా అడ్డుకుంటున్నాడంటే కార‌ణం ఏమై ఉండాలి? సిబిఐలో అత్యున్న‌త స్థాయిలో జ‌రుగుతున్న అంత‌ర్గ‌త వివాదాలు జ‌రుగుతున్నాయి అని, కేంద్రం చెప్పిన‌ట్టు సిబిఐ లోని ఒక వ‌ర్గం త‌మ‌పై క‌క్ష సాధిస్తోంద‌ని వాపోతున్నాడు చంద్ర‌బాబు. మ‌ర‌లా అయితే కొన్నాళ్ల క్రితం హైకోర్ట్ ఛీఫ్ జ‌స్టిస్ లు మీడియా ముందుకొచ్చి ఓ వివాదం గురించి బ‌హిరంగంగా మాట్లాడారు. క‌నుక రాష్ట్రానికి సుప్రీం కోర్టుతో సంబంధం లేద‌ని చంద్ర‌బాబు జీవో ఇవ్వ‌గ‌ల‌రా అని ప్ర‌శ్నిస్తున్నారు మేధావులు. 

ఓటుకు నోటు మొద‌లుకుని జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం వ‌ర‌కూ, అవినీతి కేసులు మొద‌లుకొని అక్ర‌మ వ్య‌వ‌హారాల వ‌ర‌కూ అన్ని చీక‌టి క‌థ‌లు వెలుగులోకి రాబోతున్నాయ‌నే అనుమాన‌మే చంద్ర‌బాబుతో ఇలా ప‌ట్ట‌ప‌గ‌లే ముసుగు వేయిస్తోంది. కావేరీ వివాదంలో కోర్టు నోటీసులు, జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం కేసులో డీజీపీతో స‌హా ముఖ్య‌మంత్రి ముందుకు వ‌చ్చి హైకోర్టు ఆదేశాలు, ప్రజా వ్య‌తిరేక విధానాల‌పై త‌ర‌చూ మొట్టికాయ‌లు ప‌డుతున్న తీరు చంద్ర‌బాబును అస‌హ‌నానికి గురి చేస్తున్నాయి. ఆ అస‌హ‌న‌మే భ‌య‌మై వెంటాడుతుంటే రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌కే అడ్డుగోడ క‌ట్టాల‌ని, రాష్ట్రాన్ని ర‌హ‌స్యంగా త‌న గుప్పెట్లో పెట్టాల‌ని చంద్ర‌బాబు వ్య‌ర్థ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. రాజ్యాంగానికే అతీతుడిలా ప్ర‌వ‌ర్తిస్తున్న ముఖ్య‌మంత్రికి ఆ అధికారం ప్ర‌జ‌లు ఇచ్చిన‌దే అని, దాన్ని తిరిగి తీసుకునే అధికారం కూడా వారి  చేతిలోనే ఉంద‌ని గ్ర‌హింపుకు రావ‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌దు.
Back to Top