- బీసీలను దూరం చేయాలనే బాబు కుట్రను భగ్నం చేసిన జననేత- కాపుల రిజర్వేషన్లపై డొంక తిరుగుడు లేని నిర్ణయం- బీసీలకు నష్టం చేయకుండా రిజర్వేషన్లు ఇస్తే సమ్మతమే- చంద్రబాబు కన్నా కాపులకు రెట్టింపు నిధులు కేటాయిస్తామని ప్రకటన- నిజాయితీగా నిర్ణయం ప్రకటించడంపై జగన్‌పై విశ్లేషకుల ప్రశంసలు

కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబును జగన్ చావు దెబ్బ కొట్టాడు. అవును.. మీరు చదివింది నిజమే. రాష్ర్టమంతా జగన్ కాపుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారని చర్చించుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిందెవరు.. చంద్రబాబు. అయితే ఆ హామీని విస్మరించిందెవరు మళ్లీ చంద్రబాబాబు. కాపులకు ఆగ్రహం ఎవరి మీదుండాలి.. చంద్రబాబు మీదే కదా. కానీ ఇప్పుడు వాళ్లంతా జగన్‌ను తిట్టుకుంటున్నారు. ఎందుకో అందరికీ తెలుసు. కానీ ఆరోజు జగన్ చేసిన వ్యాఖ్యలకు లోతైన విశ్లేషణ ఉంది. బాగా ఆలోచించే జగన్ ఆ ప్రకటన చేశారు. గడిచిన నాలుగేళ్లుగా కాపుల రిజర్వేషన్ల విషయంలో జరిగిన హైడ్రామా తెలుగు ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రతి కాపు సోదరుడు తమకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని తలచుకుని రగలిపోతున్నారు. తుని సంఘటన దగ్గర్నుంచి ముద్రగడ ఇంటిపై దాడి చేసిన ఆయన సహా కుటుంబంలోని ఆడవాళ్లని కూడా చూడకుండా అందర్నీ అనరాని మాటలతో తిడుతూ లాఠీలతో దెబ్బలు తేలేలా కొట్టారు. ఇస్తామన్న హామీని నెరవేర్చమని ధర్నాలు చేస్తుంటే ఉద్యమ కారులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా ఆ దాడులను బయటి ప్రపంచానికి తెలియకుండా తమ టీవీలు, పేపర్లలో ఎక్కడా ఆ వార్తలకు చోటు కల్పించలేదు. కానీ తుని ఘటన దగ్గర్నుంచి ముద్రగడ మీద దాడి వరకు ప్రతి సంఘటనకు కవరేజీ ఇచ్చింది మాత్రం సాక్షి మీడియా ఒక్కటే. ముద్రగడ ప్రెస్ మీట్ పెడితే ఎల్లో మీడియా ఎప్పడూ పట్టించుకోలేదు. కానీ సాక్షి మీడియా మాత్రం కాపుల ఆవేదనను ప్రపంచానికి చూపించింది. ఉద్యమం తీవ్రం కావడంతో చంద్రబాబు తన అలవాటైన మరో మోసపూరిత ప్రకటన చేశాడు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ కేబినెట్‌లో ప్రకటన చేయించాడు. బీసీ ఎఫ్‌గా చేర్చి 5 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ప్రకటించాడు. అప్పుడు మాత్రం పచ్చ మీడియా దానికి విపరీతమైన ప్రచారం కల్పించింది. మొదటి పేజీ వార్తలతో మూడు కాలాల ఫొటోలతో హోరెత్తించారు. కానీ కేంద్రం పరిధిలో ఉన్న రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు ఎలా ప్రకటించాడని మాత్రం ఆ పత్రికలకు అనవసరం.
ఒక పక్క కాపు రిజర్వేషన్లపై ఉద్యమాలు జరుగుతుంటే చంద్రబాబు తన కుట్ర రాజకీయాలతో కాపులకు వ్యతిరేకంగా కొత్త ఉద్యమాలకు రూపకల్పన చేయించాడు. బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తామూ మద్దతు ప్రకటిస్తామని జగన్ ఏనాడో చెప్పారు. వైఎస్సార్‌సీపీకి బీసీలను దూరం చేయడమే లక్ష్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌తోపాటు గ్రామాల్లో మనుషులను కేటాయించి మరీ ప్రచారం చేయడం వైయస్ జగన్ దృష్టికొచ్చింది. అందుకే అటు బీసీలను ఇటు కాపులను దూరం చేసుకోవడం ఇష్టం లేని జగన్..కాపు ల రిజర్వేషన్లపై ప్రకటన చేశారు. కాపులకు చంద్రబాబు కంటే రెట్టింపు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. చంద్రబాబు చేసిన మోసాన్ని కాపు సోదరులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం పరిధిలో ఉన్న రిజర్వేషన్ల అంశంపై తాను అసత్య హామీలిచ్చి మోసం చేయలేనని నిజాయతీగా ధైర్యంగా ప్రకటించారు. కాపుల ఉద్యమాలకు ఈ నాలుగేళ్లుగా అండగా నిలిచిన తనను అక్కున చేర్చుకుంటారని ఆయన విశ్వాసంతో ఉన్నారు. డొంక తిరుగుడు లేకుండా జగన్ తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. వైయస్ ఆర్‌సీపీకి బీసీలను దూరం చేయాలనుని చంద్రబాబు భంగపడ్డాడు. తాను చేసిన మోసానికి ఎలాగూ కాపుల ఓట్లు పడే ప్రశ్నేలేదని గ్రహించిన చంద్రబాబు.. గడిచిన ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచిన బీసీలను ఆయనకు చేయాలని చేసిన వ్యూహానికి జగన్ చిన్న ప్రకటన ద్వారా గండి కొట్టేశాడు. రిజర్వేషన్లు కల్పస్తామని మోసం చేసిన చంద్రబాబు నమ్మేకంటే.. నిజాయితీగా తెగేసి చెప్పిన జగన్‌కే కాపులు అండగా నిలుస్తారని చెప్పడానికి సజీవ సాక్షం ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ప్రజాదరణే.