చంద్రబాబు జైలుకు వెళ్లడని తేల్చిన పవన్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీతి, న్యాయం అనేవి ఎప్పుడో కృష్ణానదిలో కొట్టుకుపోయాయంటున్నారు. దానికి రుజువే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి మాటలు. అవినీతి గురించి గంటలు గంటలు లెక్చర్లు దంచే పీకే ప్రభుత్వం చేసే అవినీతికి మాత్రం శిక్షలుంటాయని శెలవివ్వడం లేదు. ఓ పక్క వైఎస్ జగన్ పై పెట్టిన కేసులు వీగిపోతున్నాయి. కక్ష పూరితంగా వేసిన ఛార్జిషీటుల్లో పసలేదని, ఆరోపణలు రుజువు కాలేదని కోర్టులు తీర్పులిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ కు అవి తెలియదు. తెలిసుకునే ప్రయత్నమూ చేయడు. ఎందుకంటే టిడిపి ఆఫీసు నుంచి వచ్చే స్క్రిప్టును చదవడం తప్ప పీకేకు తెలిసిందేమీ లేదు కనుక. ఒకప్పుడు సుజనా చౌదరి చేతిలో పెట్టిన కాగితాల్లో ఏముందో కూడా చూడకుండా గుడ్డిగా ఫాలో అయిపోయిన పవన్, ఇప్పుడూ అదే పని చేస్తున్నాడు. తెలుగుదేశం అధినేత ఆడమన్నట్టల్లా ఆడటం, అన్నమన్నదల్లా పెంపుడు చిలకల్లే వల్లె వేయడమే పవన్ చేసే పని. 
జగన్ జైలుకు వెళ్లడం ఖాయం అని చెబుతున్న పవన్ కళ్యాన్ అది ఎందుకో కూడా ప్రజలకు వివరించి ఉండాలి. కానీ ఆయనాపని చేయడు. 
చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినప్పుడు ఆయన జైలుకెళ్తాడని పవన్ చెప్పలేదు.
23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నప్పుడు చంద్రబాబు జైలుకెళ్తాడని పవన్ చెప్పలేదు
రాష్ట్రంలో ఇసుక మట్టిని మాఫియాగా మార్చినందుకు బాబు జైలుకెళ్తాడని పవన్ చెప్పలేదు
రాష్ట్రంలో మైన్లను తమ్ముళ్లకు రాసిచ్చేసి, అక్రమ మైనింగులపై చర్యలు తీసుకోనందుకు బాబు జైలుకెళ్తాడని పవన్ చెప్పలేదు
పట్టిసీమ, పోలవరం కాంట్రాక్టు పనుల్లో అవకతవకలు జరిగాయని కాగ్ నివేదిక ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు జైలు కెళ్తాడని పవన్ చెప్పలేదు.
రాజధాని నిర్ణయం నుంచి, భూసేకరణ వరకూ, సింగపూరు కంపెనీతో టై అప్ నుంచి రైతుల భూములను తాకట్టు పెడతానని అంటున్నంత వరకూ ఆర్థిక నేరాల చేసినందుకు బాబు అరెస్టు అవుతాడని పవన్ చెప్పడు.
ఖజానాను కొల్లగొట్టి డాబుగా విమానాల్లో తిరిగే బాబును పవన్ తప్పు పట్టలేదు.
హెరిటేజ్ కంపెనీలో లాభాల కుప్పలు ఎక్కడివని నిలదీయలేదు.
ప్రకటించే ఆస్తులకు, అనుభవిస్తున్న ఆస్తులకు వ్యత్యాసం ఉందని ప్రశ్నించలేదు.
కానీ జగన్ జైలుకు వెళతాడని మాత్రం జోస్యం చెబుతాడీ పీకే.
అధికార టీడీపీ అధినాయకుడు ఎన్ని అక్రమాలు చేసినా ఆయన జైలుకు వెళతాడని మాత్రం పవన్ చెప్పనే చెప్పడు. అంటే బాబు మేనేజ్ చేసే వ్యవస్థల గురించి, చట్టాన్ని తప్పించుకునే తర్కాల గురించి పవన్ కు బాగా తెలిసినట్టు ఉంది. టీడీపీ జనసేన కలిసే ఉన్నారనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. 
మొన్న శివాజీ ఇలాగే ఓ గరుడ పక్షి కథ చెప్పి, జగన్ పై హత్యాయత్నం నాటకానికి తెరతీసాడు.
నేడు పవన్ కూడా ఏదో జరగబోతోందని చెప్పడం వెనుక మరిన్ని కుట్రలు దాగున్నాయా? ప్రతిపక్ష నేతపై అధికార టీడీపీ కుట్రలు కొనసాగుతున్నాయా అని అనుమానిస్తున్నారు వైఎస్ జగన్ అభిమానులు. 




 
Back to Top