అమరావతికి ‘పనామా’ గతే..!

చట్టాలంటే లెక్కలేదు... న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు.. ఓటేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న కనీస బాధ్యత లేదు. గెలిచాము.. అధికారం అనుభవించాలి. కనీసం పది తరాలు కూర్చుని తిన్నా తరగిపోని ఆస్థి సంపాదించాలన్న యావ తప్పితే గెలిపించిన ప్రజలకు కొంచెమైన మేలు చేయడం పక్కన పెడితే అడ్డగోలుగా దోచుకోవడమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తున్నాడు. సిగ్గు, అభిమానం, మర్యాద అనే మాటలు ఎప్పుడో మర్చిపోయారు. జనాలు తిట్టనీ.. కోర్టులు మొట్టికాయలు వేయనీ.. ప్రతిపక్షాలు చీదరించుకోనీ.. ఆఖరికి సొంత పార్టీ నేతలే అరాచకాలకు అంతం ఎప్పుడా అని కడుపు మండి మంచి రోజు కోసం చూస్తున్నారంటేనే తెలుస్తుంది.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందో.. 

‘పనామా స్కామ్‘ లో ఉన్న సంస్థలకు అమరావతి బాధ్యతలు
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే 33 వేల  ఎకరాలను రైతుల నుంచి లాక్కున్నారు. స్విస్‌ చాలెంజ్‌ విధానం వద్దని 2011 లోనే కోర్టులు తేల్చి చెప్పినా వినలేదు. స్విస్‌ చాలెంజ్‌తో ప్రభుత్వానికి చేకూరబోయే లబ్ధి గురించి న్యాయస్థానాలు ప్రశ్నించినా సమాధానం చెప్పడం లేదు. సొంత ఆస్థిని పంచినట్టు రైతుల భూములను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెడుతున్నారు. ఈరోజు చెప్పిన మాటకు రేపు మాట్లాడే మాటకు పొంతన ఉండదు. అంతర్జాతీయ రాజధానిలో మూడేళ్లుగా సమాధి రాళ్లే దర్శనమిస్తున్నాయి. సత్తా లేని రాయపాటి ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు అమరావతిని కూడా ‘పనామ’ కుంభకోణంలో చిక్కుకున్న కంపెనీలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం వెనకాడటం లేదు. కోర్టులు అడ్డుచెప్పినా, ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా అమరావతి నిర్మాణం మాత్రం తనకిష్టమైన సింగపూర్‌ కంపెనీలకే కట్టబెట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. సింగపూర్‌కు చెందిన అసెండాస్‌– సిన్‌ బ్రిడ్జ్‌ గ్రూపు సహా జూరాగన్, సుర్బానా సంస్థలకు అమరావతిని అప్పగించేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ కంపెనీల్లో జేటీసీ, టెమ్‌సెక్‌ సంస్థలు అంతర్‌ భాగస్వామ్య కంపెనీలుగా ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఒకదానికి టెండర్‌ అప్పగించేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు పనామా జాబితాలో ఈ కంపెనీల పేర్లు ఉండడం కలకలం రేపుతోంది. 

సొంత దేశాల్లోనే పన్నులు ఎగ్గొట్టిన సంస్థలు
సొంత దేశాల్లో పన్నులు ఎగ్గొట్టి పనామా దేశంలో కంపెనీలు పెట్టిన సంస్థల జాబితాలో టెమ్‌సెక్‌ సంస్థ ప్రముఖంగా ఉంది. టెమ్‌సెక్‌ సంస్థకు అసెండాస్‌తో కూడా బలమైన సంబంధాలు ఉన్న విషయం ఆధారాలతో సహా బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్‌ అధికారి ఇఎఎస్‌ శర్మ సదరు ఆధారాలతో సహా ఏపీ సీఎస్‌ టక్కర్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ కల్లాంలకు లేఖలు రాశారు. అమరావతి నిర్మాణ పనులను దక్కించుకునేందుకు సిద్ధమైన కంపెనీలు పనామా జాబితాలో ఉన్న విషయాన్ని వారికి వివరించారు. ఈ అంశాలపై కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు శర్మ చెప్పారు. పనామా ఆధారాలను కూడా ఈడీకి సమర్పిస్తానన్నారు. 
Back to Top