అడుగులే ఫిరంగులై....



ప్రజా సంకల్ప యాత్ర .... ప్రజలతో మమేకమై, ప్రజాక్షేమమే ధ్యేయమై సాగుతున్న యాత్ర. ప్రతిపక్ష నాయకుడు ప్రజా నాయకుడై సాగిస్తున్న జైత్రయాత్ర. ఈ యాత్ర ఆరంభమై నేటికి ఏడాది గడిచింది. సంవత్సర కాలంపాటు నిర్విరామంగా సాగిన పాదయాత్రను చూసి ప్రపంచమే అబ్బురపడుతోంది. అయితే ఇదే ప్రజా సంకల్పం మరి కొందరికి మహాకంటకం అయ్యింది. ఎపి ప్రభుత్వంలో అదురును బెదురును పుట్టించింది. 
ప్రజా సంకల్పయాత్ర  అధికార పార్టీ గుండెల్లో ఫిరంగులను మోగిస్తోంది. ఆ పాదయాత్రికుని అడుగులే చంద్రబాబు ప్రభుత్వపై పిడుగులై కురుస్తున్నాయి. కిందిస్థాయి నేత నుంచి అధినేత వరకూ ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అసలు ఆరంభంలోనే ప్రజాసంకల్ప పాదయాత్రపై విమర్శలు గుప్పించింది తెలుగుదేశం అధినాయకత్వం. బుర్రకథకు తందాన పాడినట్టు ఆ పార్టీ నాయకులు అధినేతకు చిడతలు వాయిస్తూనే ఉన్నారు. 
ప్రజా సంకల్ప పాదయాత్ర గురించి జగన్ ప్రకటించగానే చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైంది. ఆరంభానికి ముందే ఎన్నో అపోహలు సృష్టించాలనుకున్న పచ్చపార్టీల ప్లాను తల్లకిందులైంది. ఇడుపుల పాయనుంచి ప్రజాసంకల్పం ప్రారంభమైంది. పనామా పేపర్లలో జగన్ పేరు అంటూ పచ్చబాచ్ పిచ్చి కూతలు ప్రయోగించింది. దమ్ముంటే నిరూపించమే జగన్ సవాల్ కు తోకముడిచింది. పాదయాత్రలో ప్రజలు లేరంటూ అసత్యాలకు తెరలేపితే సోషల్ మీడియా విజృంభించి వాస్తవాలను ప్రజలముందుంచింది. పోటెత్తే ప్రభంజనాన్ని చూసి పచ్చప్రచారకులకు కడుపు మండుతూనే ఉంది. ఏం చేయాలో పాలుపోక తెలుగుదేశం నాయకులు ఎంచుకున్నే ఏకైక మార్గం పాదయాత్రపై బురదజల్లడం. వైఎస్ జగన్ పై ఆరోపణలు గుప్పించడం. 
పాదయాత్ర పేరంటే ఎందుకంత భయం?
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఆరంభించినప్పటి నుండీ టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు, చివరకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా ప్రతి ఒక్కరూ పాదయాత్రపై మాటల దాడులు చేసినవాళ్లే. జగన్ పాదయాత్రను తక్కువ చేసి చూపాలని, అవహేళన చేయాలని, ప్రజల్లో పాదయాత్రపై వ్యతిరేకత కలగాలని టిడిపి పడ్డ పాట్లు అన్నీ ఇన్నీకావు.
ప్రజలకు జగన్ ఏం చెబుతాడు? చెప్పినా జనం ఎందుకు నమ్ముతారు అన్నారు కేంద్రమంత్రిగా ఉన్నఅశోక్ గజపతిరాజు. వచ్చే ఎన్నికలకు వైసిపి ఉండదంటూ జోస్యం చెప్పారు ఉపముఖ్యమంత్రి కె.ఈ కృష్ణమూర్తి. అసెంబ్లీ అంటే జగన్ కు భయం అని యనమల రామకృష్ణుడు, జగన్ పాదయాత్ర చేసిన ప్రాంతాన్ని కడుగుతామని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ చంద్రబాబు, జగన్ చెప్పేవి అబద్ధాలు అని నారా లోకేష్, జగన్ సభలో జనం అంతాగ్రాఫిక్సే అంటూ జెసి, జగన్ ది మార్నింగ్, ఈవెనింగ్ వాక్ అంటూ దేవినేని ఉమ, జగన్ కు అధికార కాంక్ష తోనే పాదయాత్ర అని మంత్రి పత్తిపాటి పుల్లారావ్. జగన్ రోడ్లపై తిరుగుతున్నాడన్నాడు సోమిరెడ్డి ఇల ఇష్టం వచ్చినట్టు వాఖ్యలు చేసారు. నిజానికి జగన్ పాదయాత్రవల్ల టిడిపికి జరిగే నష్టమే లేకుంటే, జగన్ పాదయాత్రలో అన్నీ అబద్ధాలే చెప్పి ఉంటే, జగన్ పాదయాత్ర ప్రభుత్వ అభివృద్ధికి ఆటంకం అయితే లక్షలాదిగా ప్రజలు స్వచ్చందంగా యాత్రలో పాల్గొంటారా?? అడుగడుగునా ఆ నాయకుడిపై అంతలా అభిమానం కురిపిస్తారా? తమ కష్టాలను చెప్పుకునేందుకు అంతలా ఎదురు చూస్తారా? వాస్తవం ఏమిటంటే పాదయాత్ర పేరే దేశం నేతల్లో అంతులేని భయాన్ని నింపింది. మొదలైన మొదటి రోజునుంచే జగన్ కు దక్కుతున్న ఆదరణ చూసి అసూయ పెరిగిపోయింది. అధికార పార్టీపై వ్యతిరేకతను ప్రజలు జగన్ ముందు బైటపెడుతున్నారు. ప్రభుత్వ అలసత్వాన్ని ప్రతిపక్ష నాయకుడికి వివరిస్తున్నారు. ఆదుకోమంటూ అతడి చేతులు పట్టుకుంటున్నారు. అతడిచ్చిన భరోసాని మనసారా నమ్ముతున్నారు. ఇదంతా తెలుగు తమ్ముళ్లకు చేదు గుళికలా ఉంది. జగన్ ను, జగన్ పాదయాత్రను విమర్శించడం తప్ప వారికి మరో గత్యంతరం లేనట్లైంది. 
మొత్తానికి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందన చూస్తే దేశం నేతలకు కంటిమీద కునుకుండటం లేదని అర్థం అవుతోంది. చివరకు ఆ భయమే ప్రతిపక్ష నేత ప్రాణహానిని కూడా పట్టించుకోనంత పగకు కారణమైంది. తమ ఓటమి భయమే టిడిపి నాయకుల ఉలికిపాటుకు కారణం. జగన్ వెంట పరుగులు పెట్టే జన సందోహాన్ని ఆపలేక ఉద్రేక పడుతున్న తెలుగు తమ్ముళ్లను చూసి రాష్ట్రమే నవ్వుకుంటోంది. 

 
Back to Top