చంద్రబాబుది బలం కాదు..వాపు...

ప్రజల డబ్బుతో డ్రామాలా..

చంద్రబాబు ఎఐసిసి కోశాధికారిగా పనిచేస్తున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య...

హైదరాబాద్‌: చంద్రబాబు ఢిల్లీ దీక్ష..కేవలం పార్టీ ప్రయోజనాలు కోసమే అని  వైయస్‌ఆర్‌సీపీ  నేత సి.రామచంద్రయ్య అన్నారు. కొయ్యగుర్రంపై స్వారీ తప్ప చంద్రబాబు ఏం సాధించారని మండిపడ్డారు. పార్టీ ప్రయోజనాలు కోసమే తప్ప రాష్ట ప్రయోజనాలు కోసం కాదన్నారు. ప్రజల సొమ్ము రూ.10 కోట్లు ఖర్చుపెట్టి ఢిల్లీలో  దీక్షలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఖజానా నుంచి  నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఢిలీల్లో దీక్షకు చంద్రబాబు ఖర్చుపెట్టిన రూ.10కోట్లుతో రాష్ట్రంలో ఒక చిన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తిచేయవచ్చన్నారు. ప్రజల డబ్బును దుబారా చేసి.. చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు ఎవరి సొమ్ము అని ఖర్చుపెడుతున్నారని ప్రశ్నించారు.

పార్టీ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి డబ్బులు ఖర్చుపెట్టుకోవచ్చు కాదా అని ప్రశ్నించారు. పార్టీ ఈవెంట్‌లకు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టడం పద్దతి కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టాడని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపితే ఎందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు వెళ్లలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఎఐసిసి కోశాధికారిగా  పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎన్నికల ఖర్చులు చంద్రబాబే ఇచ్చాడన్నారు. నార్త్‌ ఇండియా వెళ్లకుండానే ఆ మూడు  రాష్ట్రాల్లో విజయంలో నా పాత్ర ఉందని చంద్రబాబే చెప్పుకున్నారని గుర్తుచేశారు.

చంద్రబాబు చేత రాహుల్‌ గాంధీ నీచంగా తిట్టించుకున్నారన్నారు. చంద్రబాబు.. రాహుల్‌ తల్లిని,వంశాన్ని కూడా తిట్టారని గుర్తుచేశారు. నేడు రాహుల్,చంద్రబాబు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, పౌరుషం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన దీక్ష డ్రామాను  తన ఎల్లో మీడియాల్లో  గొప్పగా రాయించుకున్నారని, జాతీయ మీడియా పట్టించుకోలేదన్నారు.దీక్ష పేరుతో తన వెంట పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకెళ్ళి హడావుడి చేయడం బలం కాదని.. వాపు అని పేర్కొన్నారు. డ్రామాను రక్తికట్టించడానికి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేసి రైళ్లు,విమానాలలో నాయకులను, ప్రజా సంఘాల నాయకుల పేరుతో చెలామణీ అవుతున్నవారిని తరలించారన్నారు. చంద్రబాబు వేషాలు తెలుసుకాబట్టే కామ్రేడ్లు ఢిల్లీకి వెళ్లలేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఒక టీడీపీ ఎంపీ కూడా మాట్లాడలేదన్నారు. రాహుల్‌గాంధీ గుంటూరుకు వెళ్ళితే  ఆయనపై రాళ్లు వేయించారని,ఇప్పుడు రాహుల్‌ ఏవిధంగా కాంప్రమైజ్‌ అయ్యారని  ప్రశ్నించారు.

Back to Top