బీసీ గ‌ర్జ‌న‌కు త‌ర‌లిరండి

వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు జంగా కృష్ణ‌మూర్తి 
 

హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 17న ఏలూరులో నిర్వ‌హిస్తున్న బీసీ గ‌ర్జ‌న స‌భ‌కు బిసి వర్గాలందరూ  త‌ర‌లిరావాల‌ని పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు జంగా కృష్ణ‌మూర్తి పిలుపునిచ్చారు. బుధ‌వారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో చ‌ర్చించిన అనంతం అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధితో క‌లిసి జంగా కృష్ణ‌మూర్తి మీడియాతో మాట్లాడారు. బిసిల జీవనప్రమాణాలను పెంపొందించేవిధంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ ప్రకటించబోతోంది.రాష్ర్ట వ్యాప్తంగా  వైయస్ జగన్ నియమించిన బిసి అధ్యయన కమిటి పర్యటించింది. ఈ పర్యటన ద్వారా వారి జీవనస్దితిగతులను అంచనా వేశాం. అనేక బిసి వర్గాలు,సంఘాలు తమ తమ అభిప్రాయాలు ఇచ్చారు. వారి సూచనలు సలహాలు తీసుకుని బిసి డిక్లరేషన్ తయారుచేయడం జరిగింది. -చట్టసభలలో బిసిలకు రిజర్వేషన్లు.

వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో ప్రకటించినవిధంగా అన్ని కులాలకు కార్పోరేషన్ లు ఏర్పాటు చేయడం,ఆయా కులాలకు ఆర్దికంగా వృధ్దిలోకి తీసుకువచ్చేందుకు కావాల్సిన చర్యలు బిసి డిక్లరేషన్ లో ఉంటాయి. బిసి వర్గాలలోనుంచి పారిశ్రామికవేత్తలను తయారు చేసే చర్యలు కూడా ఇందులో ఉంటాయి. ఈ బిసి డిక్లరేషన్ ఏలూరులో ఈనెల 17 వతేదీన జరిగే బిసి గర్జనలో ప్రకటించడం జరుగుతంది.బిసిలను అన్ని విధాలా ఆదుకునేఅంశాలపై పార్టీలోని బిసి నేతలతో వైయస్ జగన్ పలుమార్లు చర్చించారు. రాష్ర్టంలోని బిసి ప్రజానీకం అందరికి చెబుతున్నాం. బిసి వర్గాలందరూ బిసిగర్జనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top