దేవుని ఆశీస్సుల‌తో ప్ర‌జ‌ల ఆశ‌లు,ఆకాంక్ష‌ల‌ను సాకారం చేస్తా 

ట్విట్ట‌ర్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి
 

అమరావతి: దేవుని ఆశీస్సులతో ప్రజల ఆశలను,ఆకాంక్షలను సాకారం చేస్తానని ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఉదయం 8.39 నిమిషాలకు సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలోకి అడుగుపెట్టారు. పురోహితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య తన సీటులో ఆశీసులయ్యారు. అనంతరం మూడు ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తొలి ట్వీట్ చేశారు. 

 

తాజా వీడియోలు

Back to Top