వైయస్‌ఆర్‌సిపి టియుసి జిల్లా కో ఆర్డినేటర్లు వీరే

హైదరాబాద్, 12 నవంబర్‌ 2012: పని విభజనలో భాగంగా తమ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌కు వివిధ జిల్లాల కో ఆర్డినేటర్లను నియమించినట్లు పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బి. జనక్‌ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కో ఆర్డినేటర్లు ఆయా జిల్లాల్లోని పార్టీ జిల్లా కన్వీనర్లను సంప్రతించి జిల్లా కమిటీల నియామకం, నూతన సంఘాల ఏర్పాటు, కార్మికులను సభ్యులుగా చేర్పించడం, ఆయా జిల్లాల కార్మికుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తారని ఆయన వివరించారు. అలాగే, వీరంతా మేనేజ్‌మెంట్లతోను, కార్మిక శాఖతో సంప్రతింపులలో సహకరించి వైయస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

జిల్లాల కో ఆర్డినేటర్లు వీరే:
మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల కో ఆర్డినేటర్‌గా పి. నర్శింహారెడ్డి, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు ఎం. బాబూరావు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు బి. ఓబుల్‌రెడ్డిని, వైయస్‌ఆర్‌ జిల్లా, కర్నూలు జిల్లాల కో ఆర్డినేటర్‌గా ఎ. రాజారెడ్డిని నియమించినట్లు జనక్ ప్ర‌సాద్‌ తెలిపారు. రంగారెడ్డి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల కో ఆర్డినేటర్‌గా సిహెచ్‌. రవీంద్రరెడ్డిని, నిజామాబాద్‌, మెదక్‌, నల్గొండ జిల్లాలకు ఎన్‌. హరికృష్ణను, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఎం.ఎస్‌.వి.ఆర్‌. మూర్తి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు ఎన్‌. రవిప్రసాద్‌ను, కృష్ణా జిల్లాకు సిహెచ్‌. మనోరంజనిని, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ కో ఆర్డినేటర్లుగా నియమించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నియామకాలన్నీ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకే చేసినట్లు ప్రకటనలో జనక్‌ ప్రసాద్ స్పష్టం చే‌శారు.

తాజా వీడియోలు

Back to Top