ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా మైసూరా

కాకినాడ: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఉభయ‌ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా మాజీ ఎంపి డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం శనివారం నిర్ణయం తీసుకుంది. ‌ఈ బాధ్యతలను ఇప్పటి వరకు  పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి చూస్తున్నారు. తాజాగా నాగిరెడ్డి స్థానంలో మైసూరారెడ్డిని నియమించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలతో మైసూరారెడ్డికి ఉన్న పరిచయాలు పార్టీ నేతల మధ్య సమన్వయానికి, పార్టీ పటిష్టతకు దోహదం చేస్తాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మైసూరారెడ్డి పార్టీ కేంద్ర పాలక మండలి, రాజకీయ వ్యవహారాల కమిటీలలో సభ్యునిగా ఉన్నారు. మైసూరారెడ్డి నియామకం పట్ల పార్టీ ఉభయ గోదావరి జిల్లాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Back to Top