తెలంగాణపై కేంద్రమే తేల్చాలి:వైయస్ఆర్ సీపీ



శ్రీ సుశీల్ కుమార్ షిండే,
కేంద్ర హోం మంత్రివర్యులు,
న్యూఢిల్లీ.
                                                                                                                                                                    తేదీ:డిసెంబర్ 28, 2012

       డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశంలో అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు అలాగే అన్ని ప్రాంతాల వారు సుఖసంతోషాలతో తమ జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ- భారత రాజ్యాంగంలో అనేక అధికరణలను పొందుపరచారు. అధికరణలను అమలు పరచే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అందులో భాగంగానే ఆర్టికల్-3ను రాజ్యాంగంలో పొందుపరిచి, రాష్ట్రాలను విభజించాలన్నా లేదా కలిపి ఉంచాలన్నా ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కేంద్రానికి సర్వాధికారాన్ని ఇచ్చారు.

      అందుకే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకుండా, ఎన్ని పార్టీలు ఏమి చెప్పినా ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పటికీ మీ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం-రావణ కాష్టంగా మారింది. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అయినా ఈ రాష్ట్రంలో ఒక పార్టీగా ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యతను గుర్తించి మా వైఖరిని ఇలా తెలియజేస్తున్నాము.

     ఇంతకు ముందు 2011 జూలై 8, 9 తేదీల్లో మేము మా పార్టీ మొదటి ప్లీనరీలో చెప్పినట్టుగా- తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తున్నాం. ఆర్టికల్ - 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరిత గతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం.


                                                                                                                           వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున



                                                                                                                                    ఎం.వి.మైసూరారెడ్డి,
                                                                                                           మాజీ ఎంపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు.



                                                                                                                                      కె.కె.మహేందర్ రెడ్డి,
                                                                                                                            వైయస్ఆర్ కాంగ్రెస్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు.
Back to Top