ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో 18 ఉప ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు చూస్తుంటే వీళ్లలో రాక్షస అంశ ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతుంది.ఈ 18 ఉప ఎన్నికలలో ప్రదాన ప్రతిపక్షం విమర్శలు ఎటు చేయాలో కూడా మరిచిపోయినట్టుగా రోజుకొక అబద్దం తోటి కట్టు కథ తోటి జగన్మోహన్ రెడ్డికి బురద పూసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ రకాల రాక్షస రూపాలు చూసింది నారా వారి రూపంలోనే అనే సంగతి మరచిపోయారనుకుంట. మీ పాలనను ప్రజలు ఇంకా మరచిపోలేకే 2004,2009 మీ పార్టీని మిమ్మల్ని దూరంగా పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గజదొంగల పార్టీ అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే దోపిడి దారులకు దొంగలకు పదవులు ఇస్తారని అంటున్నారు ఈ రకంగా ప్రజల దగ్గరకి వెలుతున్న పరిస్తితి చూస్తుంటే రాజకీయాలలో ఎంత దిగజారుతున్నారు అనేది మాకు అర్దం అవుతుంది. మీరు దిగజారుడే కాదు రాజకీయాలను దిగజారుస్తున్నారు. మీడియా దిగజారడానికి కారణం చంద్రబాబునాయుడే. ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు అంటేనే పార్లమెంటులో అయ్యబాబోయి అని గుండెలు బాధుకుంటున్నారు. రాముడి వారసులు అయినట్టు ఈ రోజు చంద్రబాబు పాలన అంతా రాముడి పాలన అని ప్రజలు సుఖసంతోశాలతో ఉన్నారని మీడియా ముందు తీపి జ్ఞాపకాలని నెమరువేసుకుంటున్నారు. రైతులు తిన్నది అరక్క ఆత్మ హత్యలు చేసుకుంటునరాని, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు పరిహారం కోసం చనిపోతున్నారని రైతుల గురించి చులకనగా మాట్లాడుతున్నారు. కరెంట్ సమస్య ఆందోళన చేస్తుంటే గుర్రాలతో తొక్కించారు. అంగన్వాడీ టీచర్లను చీరలు లాగి జుట్టు పట్టి లాగించారు మీ ప్రబుత్వంలో ........... అబివృద్ది అంటే హైటెక్ సిటీలు, సింగపూర్లో హోటళ్లు మీ అబ్బాయి విదేశాలలో చదువులు వీటినే అబివృద్ది అనుకుంటున్నారు. మీరు 2004 లో ఓడిపోయాక చంద్రగ్రహనం వీడిపోయింది అనుకున్నారు ప్రజలంతా. చంద్రబాబు భూముల గురించి మాట్లాడుతున్నాడు ముందు ఎన్‌టిఆర్ ట్రస్ట్ భూముల గురించి చెప్పండి, రామోజీగారు భూముల గురించి మాట్లాడుతున్నారు అక్రమాస్తుల కేసులో లేబుల్ అతికించుకోదగినది రామోజీకేసే. జగన్మోహన్ రెడ్డి గారివి అక్రమాస్తులు అని ఇంత వరకు ఏ కోర్టు తీర్పు ఇవ్వలేదు. రామోజీ రావు భూములు ఆక్రమించాడని లాండ్ త్రిబునల్ ఓ తీర్పు ఇచ్చింది. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీకి 18 స్థానాల్లో డిపాజిట్లు రావని అంటున్నారు. మీరు ఛాలెంజ్ చేయండి 18 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కి డిపాజిట్లు వచ్చీ గెలుపొందితే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా............. ఛాలెంజ్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరపున .....