స్పీకర్: వాసిరెడ్డి పద్మ -ఏప్రియల్02,2012

జగన్ మోహన్ రెడ్డి  గారి మీద చార్జీషీట్ పెట్టి నప్పటి నుండి ధర్మాన ప్రసాదురావుగారు కొందరు మురళి, శైలజానాథ్ గారు నోటికోచినట్లు మాట్లాడారు. మేము వై.ఎస్.ఆర్. కాంగ్రెస్  పార్టీ తరుపున ఈ వ్యాక్యలను ఖండిస్తున్నాం. రాజశేఖర్రెడ్డి గారి నేరుగా తిట్టాలనే తాపత్రయం వాళ్ళలో కనిపిస్తుంది. రాజశేఖర్రెడ్డి గారిని తిడితే ప్రజలు రాళ్ళతో కొడతారని జగన్ మోహన్ రెడ్డి  గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఆ 26 జీఓ లకు సంబంధించి మంత్రులు సుప్రీం కోర్టుకి సమాధానం చెప్పాలి.

రాజశేఖర్రెడ్డి గారి హయామ్ లో జరిగిన భూ కేటాయింపులు తప్పనుకుంటే వాటి మీద మీరు మాట్లాడగలరా అని అడుగుతున్నాం. రెవిన్యూమంత్రి ధర్మాన ప్రసాదురావు గారికి తెలియకుండా ఏ ఒక్క జీ.ఓ. శాంక్షన్ కాదు. అలాగే  మీ విధ్యుత్ ప్రాజెక్టులు మైనింగ్ వ్యవహారాలూ అన్నింటి మీద విచారణ జరిగితే  మీరు జైలుకి వెళతారని తెలియజేస్తున్నాం. ఈ రోజు కాకపోయినా రేపైనా విచారణ జరిగితే మీరు జైలుకు వెళతారు. మంత్రులు ఒక్క మాట స్పష్టం చేయాలి భూ కేటాయింపులను తప్పు పట్టతలచుకుంటే చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన భూ కేటాయింపుల మీద ఒక్క మాట మాట్లాడరు.... ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన తెలుగు వారి కంపెనీలు అయినా అరబిందో, హేటిరోఫార్మాకి భూమి కేటాయించడం నేరమని మంత్రులు మాట్లాడుతున్నారు.భూములని తక్కువ ధరకి ఇచ్చామంటున్నారు.అసలు ఉచితంగా ఇచ్చినా తప్పు లేదు. ఊరుపేరు లేని ఇఎంజి  కంపెనీ కి సెంట్రల్ యూనివెర్సిటి కి సంబందించిన 400 ఎకరాలు దారాదత్తం చేసినా మంత్రులకు తప్పుగా కనిపించడం లేదా అని అడుగుతున్నాం? రాజశేఖర్రెడ్డి గారి హయాం లో జరిగిన భూకేటాయింపులప మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి.? ఒక పక్క రాజశేఖర్రెడ్డి గారి వారసులమంటారు, మరో పక్క రాజశేఖర్రెడ్డి గారి హయామ్ లో అవినీతి జరిగిందంటారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఒక ప్రకటన చేయండి. రాజశేఖర్ రెడ్డి గారి మీద మీ విధానం ఏంటి? ఆయన హయాం లో  అవనీతి జరిగిందని అనుకుంటున్నారా ? లేదా? రాజశేఖర్ రెడ్డి గారి హయాం లో అక్రమాలు జరిగాయి అనుకుంటే సుప్రీం కోర్ట్ కి చెప్పండి. ఎఫ్.ఐ.ఆర్. లో రాజశేఖర్ రెడ్డి గారి  పేరు లేదు అన్నారు, కాని ఈ రోజు చార్జీ షీట్ లో 30, 40 సార్లు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. ధర్మాన ప్రసాదరావు గారికి  సవాల్ విసురుతున్నాం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాల మీద గెలవలేదు అనుకుంటే రాజీనామా చేసి గెలవాలని కోరుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి మీద ద్వంద ప్రమాణాలతో వ్యవహరించవద్దు మంత్రులకు,ముఖ్యనాయకులకి కోరుతున్నాం. ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి  గారి పార్టీలో  నాయకులు కోళ్ళ ఫారం లో కోళ్ళు అని అంటున్నారు. మరి నువ్వు గంపకింద కోళ్ళా లేదా సొనియాగాంది  కోళ్ళ ఫారం లో  కోళ్ళా  అని మేము అడుగుతున్నాం. ఎఫైఆర్  లో మంత్రుల పేర్లు చేర్చకుండా సీబీఐ హడావిడిగా సీబీఐ చార్జీ షీట్ పెట్టడం జరిగింది. ఎ1 గా పేర్కొన్నాజగన్ మోహన్ రెడ్డి  గారిని విచారించాకుండానే అతనిఫై నేరాన్ని మోపుతారు.

తాజా వీడియోలు

Back to Top