స్పీకర్‌: జూపూడిప్రభాకరరావు - జూన్ 5, 2012

కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టూరింగ్‌ టాకీస్‌ డ్రామా కంపెనీల తయారయ్యారు

ప్రజలగుండె చప్పుడుగా మారినా వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ,  జగన్‌మోహన్‌ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఉప ఎన్నికల్లో పోటి చేస్తే కనీసం డిపాజిట్‌ వస్తుంది అని అశపడినా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు విజయమ్మగారు షర్మిలాగారికి ప్రచారంలో వస్తున్న ప్రజాదరణని చూసి నాలిక కరుచుకుంటున్నారు.

మొన్న తిరుపతిలో, నెల్లూరులో, ఒంగోలులో ఢిల్లీ నుండి వచ్చిన అజాద్‌గారు జగన్‌మోహన్‌రెడ్డి గారి గురించి మాట్లాడుతూ  జగన్‌మోహన్‌రెడ్డి గారు కాంగ్రెస్‌లో ఉంటే ముందు కేంద్రమంత్రి పదవి ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి వస్తుందిని అజాద్‌ తన మనసులో మాట చెప్పారు. కాని మరుసటి రోజు నా మాటలను మీడియా వక్రీకరించింది అని మాట మార్చారు. జగన్‌మోహన్‌రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయడానికి కాంగ్రెస్‌ తెలుగుదేశం నాయకులు కుమ్మకై పన్నిన కుట్రలు, ఎమ్మెల్సి ఎన్నికలుకాని, నో కాన్ప్‌రెన్స్‌మోషన్‌కాని ఈ ప్రభుత్వాన్ని బతికించాలని అను నిత్యం స్కిప్ట్‌ కాంగ్రెస్‌కు చదివివినిపిస్తున్న చంద్రబాబునాయుడు గారుకాని ఇవన్ని చూస్తుంటే కాంగ్రెస్‌ టీడీపీ కుమ్మకైయారు అని అర్ధఅవుతుంది. ఈ రాష్ట్రంలో సరైన నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి అని ప్రజలు అందరు అనుకుంటున్నారు. చిల్లర దొంగలను చెట్టుకుకట్టేసి కొట్టాలి అన్నా చిరంజీవి తన ఇంట్లో దొరికిన 70 కోట్ల రూపాయల గురించి అతన్ని ఎక్కడ కట్టేయాలి. 26 జీఒల మీద ఎంక్యరి తేల్చకుండా జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్‌ చేసింది సీబీఐ.  రాజశేఖరరెడ్డి గారు అవినీతి పరుడు అయితే 2004 2009 లో చేసినఅవినీతి ఆరోపణలు నిజమైతే ఆయన తరుపున మీరు ఎందుకు టిక్కెట్‌తీసుకుని నిలబడ్డారు. ఆయన తరుపున గెలిచిన తర్వాత మంత్రులుగా ప్రమాణ స్యీకారం ఎందుకు చేసారు. మంత్రులందరి విచారిస్తే స్కామ్‌లన్ని తేలవా..ఎమ్మెల్యేను విచారిస్తే మీరుచేసిన నేరారోపణలు తేలవా.. విజయమ్మగారు బయటికివచ్చి నాభర్త మరణం మీద అనుమానం ఉందని అడిగితే, బొత్స సత్యనారాయణ గారు మీరే చంపుకున్నారు అని మాట్లాడుతున్నారు. విజయమ్మ చేతితో అన్నం తిన్న బొత్స ఆ ఇంటి వాసాలు లెక్కపెడుతున్నారు. ముఖ్యమంత్రి చెబితే సంతాకాలు పెట్టాము అన్న మంత్రులు గాడిదలుకాయడానికి మంత్రులుగా ప్రమాణ స్యీకారంచేసారా అని అడుగుతున్నాం. ఇంతవరకు గడపదాటని విజయమ్మ గడపదాటి మా గడపకు వచ్చింది అని,18 స్ధానాల్లో పార్టీని గెలిపిస్తామని  ప్రజలు అంటున్నారు. చీమల పుట్టలుగా కదిలి విజయమ్మకు హరతుల పడుతున్నారు. వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే హక్కు చిరంజీవికి లేదు.70 కొట్లకు సమాదానం చెప్పకుండా 10 రూపాయల దొంగలగురించి మాట్లాడుతున్నారు. తెరవెనుక బాగాతోలు నడుపుతున్న చంద్రబాబునాయుడుగారికి ఉప ఎన్నికల ఫలితాలే బుద్దిచెబుతాయి. ఈ నెల 8 తేదినా పరకాలలో విజయమ్మగారు ప్రచారం చేస్తారు.

తాజా వీడియోలు

Back to Top