స్పీకర్‌: జూపూడిప్రభాకరరావు - జూన్ 11, 2012

ప్రజాదరణలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రతిపక్షం కుట్ర పన్ని వైయస్‌ఆర్‌ ఫ్యామిలీని రోడ్డున పడవేసే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో పాపులర్‌ నాయకుడిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి గారు  తెలుగుదేశం కాంగ్రెస్‌ నాయకులు ఆడిన నాటకంలో సీబీఐ ద్వారా ఇరికించాలని విచారించే క్రమంలో ఈ రోజు సాదారణ నేరస్తులను తీసుకువచ్చే బస్‌లోజగన్‌మోహన్‌రెడ్డిని తీసుకురావడం జరిగింది. జైల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి గారికి రక్షణకావాలి అంటే మేము చూసుకుంటాము అని చెప్పిన పోలీసులు, కోర్టుకుతీసుకువచ్చే క్రమంలో రక్షణ చర్యలు లేకుండా తీసుకురావడం జరిగింది. చట్టం ముందు అందరు సమానం అని చెప్పిన  పోలీసులు కోర్టు చెప్ని తర్వాత బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఎందుకు తెప్పించారు.....ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వాలు మా నాన్నని ఏమిచేసారని  అడిగితే రక్షణస్టీల్‌ లో బ్రదర్‌ అనీల్‌ కుమార్‌ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో అనీల్‌కుమార్‌ పేరు ఉంటే బ్రదర్‌ అనీల్‌కుమార్‌ పేరు అని ఎల్లో మీడియా రచ్చ రచ్చ చేస్తుంది. మీ దగ్గర అధారాలుంటే తీసుకురాగలరా చాలంజ్‌చేస్తున్నాం ...రక్షణ స్టీల్‌కి ఎన్‌ఎమ్‌డీఏ సర్యేచేయమని  పర్మిషన్‌ ఇస్తే 1లక్ష ఎకరాలలో ఇనుప ఖనిజాలు ఉన్నాయో సర్వేచేయని ఇచ్చారు సర్యే చేస్తే 5వేల ఎకరాలలో ఐరన్‌ఓర్‌ దోరకేఅవకాశం ఉంది. ఇది సర్వే మాత్రమే.. ఇక్కడ ఐరన్‌ ఓర్‌ తవ్యారు అని ఎక్స్‌పోర్టు చేసారని ప్రజలని నమ్మించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. దాదాపు ఈ భయ్యారం భూములని ఈ రక్షణ స్టీల్స్‌కి  ఇచ్చారు అని  14 లక్షలకోట్లు రూపాయలు ఖరీదు చేసే కట్టబెట్టారని అంటున్నారు. ఆర్‌ఐసీ రిలయన్స్‌ ఇండ్రీస్టీస ని మొత్తం అమ్మితే 2 లక్షల 70వేల కోట్లు, ఓఎన్‌జీసీ. 2 లక్షల20 వేల కోట్లు, ఎన్‌ఎమ్‌డీసీ 60 వేల కోట్ల రూపాయలు టీసీయస్‌,2 లక్షల కోట్లు, విప్రో 1 లక్ష 40 వేల కోట్లు రూపాయలు మొత్తం కలిపితే 14 లక్షలకోట్లు ఈ దేశంలో ధనవంతులు. ప్రభుత్వ అస్తులు కోలా కృష్టమోహన్‌ అనే వ్యక్తి చంద్రబాబు  అవనీతి పరుడు అంటే, టేకిటీజిగా తీసుకుని కోలా కృష్టమోహన్‌మీద ఎదురు దాడికి దిగారు. చంద్రబాబు తన హయాంలో అనంతపురంలో  వజ్రాలు సర్వేకోసం 4లక్షల ఎకరాల భూమిని సర్యేకి ఇచ్చారు.ఇనుప ముక్క కూడ దోరకని భయ్యారం భూములని 14 లక్షలకోట్లు గా లెక్క కడితే మీరు కోటాయించిన 4 లక్షల వజ్రాల ఘనులకి ఎంత కరీదు కట్టాలి. బ్రదర్‌ అనీల్‌ గారు  రక్షణా స్టీల్స్‌కి సంభందించి పరువునష్టం దావావేయబోతున్నారు.దానికి వచ్చి సమాదానం చెప్పండి. రక్షణా స్టీల్స్‌కి సంభందించి అగ్రిమెంట్స్‌ ఎవరికో జరిగితే దానిని బ్రదర్‌ అనీల్‌కి అంటగడుతున్నారు.ఇటువంటి  ఆరోపణలు మాని ప్రజల్లోకి వెళ్ళి  పోటీపడండి.ఈ రోజు తెలుగుదేశం ఎది ఔనంటే కాంగ్రెస్‌ దానికి వంతుపాడుతుంది.

Back to Top