ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కరెంట్ కోతను నగరంలో 6,7 సార్లు జిల్లాకేంద్రాల్లో 6 గంటలు, గ్రామీణ ప్రాంతల్లో 12 గంటల కోత విధిస్తున్నారు. ఈవిధంగా ఉంటె రాష్ట్రంలో అందకారమవుతుంది. ఇలా చేయడంవల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి, త్రాగునీటికి విద్యార్థులు పరీక్షా కాలంలో కరెంట్ కోత వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవతున్నారు.ఒకపక్క ముఖ్యమంత్రి గారు 6 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఈ రోజు చిన్నా మధ్యతరహా పరిశ్రమలకు 1 లక్షా 80వేల పరిశ్రమలలో 20 లక్షల మంది పనిచేస్తుంటే వారానికి 4 రోజులు కరెంట్ కోత విధిస్తున్నారు. ఈ కరెంట్ కోతలవల్ల 20లక్షల మంది ఈ రోజు బజారున పడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రాన్ని అంధకారంలో ముంచాలనుకుంటునారా అని అడుగుతున్నాం ఒక పక్క కోస్తారైతులు అగ్రికల్చర్ హాలిడే ప్రకటించుకున్నారు.రాజశేఖర్ రెడ్డిగారి ప్రభుత్వంలో 2వేల మెగావాట్ల ఫవర్ను కొని జేనకో కి డిస్కం కి ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఉపఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత కూడా రెగ్యులేటరీకమీషన్ ద్వారా 4వేల కోట్ల ద్వార ప్రజల మీద భారం మోపడానికి ఎంత దౌర్భాగ్యమో ఆలోచించుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుండి,2009 వరకు ఒక్క రూపాయని కూడా పెంచలేదు. ఆనాడు ఫీజ్ రీయంబర్స్మంట్ ఇస్తే మీరు ఎందుకు ఇవ్వలేక పోయారు. రైతులకు ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోయారు.రిలయన్స్ కేజి బేశిన్ లో 2400 మెగావాట్ల రావాల్సిన పవర్ 1500 మెగావాట్ల ఎందుకు తగ్గిపోయింది. రిలయన్స్ మీద ఒత్తిడి తెచ్చే దమ్ము లేదా అని అడుగుతున్నాం. ఈ రోజు సింహాద్రి పవర్ ప్లాంట్లో 1080 మెగావాట్ల ఉత్పతి అవుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు హయాం లో నూటికి నూరు శాతం వినియోగించుకున్నారు. కేవలం విధ్యుత్ రంగంలో 6 వేల కోట్ల రూపాయల పన్నులు వస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత 83 ఎన్నికలు జరిగితే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఓక పక్క ప్రభుత్వ తీరు ఇలాగుంటే ప్రధాన ప్రతిప్రక్షం మాత్రం ప్రజాసమస్యల మీద నోరేతడం లేదు, అధికారపక్షానికి వంతుపాడుతుంది. ప్రబుత్వ తీరు ఇలాగుంటే కాంగ్రెస్ తెలుగుదేశంపార్టీని భూస్థాపితం చేస్తారు అని తెలియచేస్తున్నాం.