స్పీకర్‌: బాజిరెడ్డి గోవర్ధన్‌, అధికార ప్రతినిధి 27-6-2012

జగన్‌మోహన్‌రెడ్డి గారు అరెస్ట్‌ జరిగిన తర్వాత రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిదిలో  ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేస్తుంన్నా  మా వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ 9 మంది యాక్టివ్‌ నాయకులను అక్క డ ఎసీపీగా ఉన్న రాంచందర్‌రావు అరెస్ట్‌చేసారు ఎందుకు అరెస్ట్‌చేస్తున్నారని మా వాళ్ళ అడిగితే  మీరు ఓ ఆర్టీసిడ్రవర్‌ను  హత్యచేసారు అని వారి మీద తప్పుడు కేసులు పెట్టారు. అక్కడే ఉన్న విజయరావు అనే ఐసియస్‌ అఫీసర్‌ని అడిగితే మిమ్మల్ని ముందుస్తుగా  అరెస్ట్‌ చేసామని తర్వాత వదిలిపెడతామని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారిని పైకితీసుకువెళ్ళి బట్టలు విప్పి మా నాయకుల మీద తరుడుడిగ్రి పయోగించడం జరిగింది నానా బూతులు తిడుతు కాలితో తన్నుతు చిత్రహింసలకు గురిచేయడం జరిగింది. ప్రమాదంలో చనిపోయిన డ్రవర్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు చంపారు అని తప్పుడు కేసులు బనాయించారు. బస్‌డ్రవర్‌ చనిపోయిన విషయంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుల ప్రమేయం లేదని విజయరావు అనే ఐపియస్‌ ఆఫీసర్‌ చెప్పారు. ఈ పోలీసులు కాంగ్రెస్‌ పార్టీ కి కోమ్ముకాస్తున్నారు ఇటువంటి అధికారలు ఉండడంవల్లా ప్రజలకు వ్యవస్ధ మీద నమ్మకం పోతుంది. సంబందిత పోలీస్‌ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొవాలి హ్యుమన్‌ రైట్స్‌ కి కంఫ్త్లెంట్‌ చేస్తాం ప్రయివేట్‌ కేసువేసి వారిని కోర్టుకు ఇడుస్తాం. ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నవారిని ఈ విదంగా ఇబ్బంది పెట్టి చిత్రహింసలకుగురిచేస్తుంది. న్యాయం కోసం ఎంత వరకైన పోరాటం చేస్తాం


Back to Top