స్పీకర్ : జనక్ ప్రసాద్ - మే 5,2012

మహానేత రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామిక అభివృద్ధి కోసం భూములు కేటాయించారు. ఈనాడు రామోజీరావు గారిని ఒక్కటే అడుగుతున్నా... చంద్రబాబు గారు అధికారం లో ఉన్నప్పుడు వేలాది ఎకరాలు హైదరాబాద్ నడిబొడ్డునా ఎమ్మార్ కి,ఐఎంజి వాళ్ళకి, జిఎమ్మార్ వాళ్ళకి వేలాది భూములు కట్టబెట్టినప్పుడు చంద్రబాబు చర్య సక్రమమైనది అని మీరు  భావించారా ...
రాజశేఖర్ రెడ్డి గారు భూములు ఇచ్చినప్పుడు మాత్రమే చట్టవిరుద్ధం అని భావించారా .... రాయితీల విషయంలో గతంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాక భారతదేశంలో ఎక్కడైనా పారిశ్రామికఅభివృద్ధి కోరుకునే ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇవ్వడం ఆనవాయితీ. కేవలం రాజశేఖర్ రెడ్డి గారి మీద బురద చల్లుదామని ఓ పార్టీకి కొమ్ముకాసుకుంటూ మీ పత్రిక ద్వారా నీ క్రింద ఉన్న తప్పులను పక్కన బెట్టి ఆవిధంగా రాయడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆస్తుల మీద నేర చరిత్ర ఉందంటే ఒక్క రామోజీరావు మీద మాత్రమే....
నీ రామోజీ ఫిలిం సిటీలో 1368 ఎకరాలు సబ్ ప్లాస్ ల్యాండ్ ఉందని ప్రభుత్వం తేల్చి చెప్పింది..... ట్రిబ్యునల్ అవార్డుకి వ్యతిరేఖంగా కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకొని బ్రతుకుతున్నారు.. కేవలం రెండు మూడు మాసాల క్రింద 60 ఎకరాల సబ్ ప్లాస్ ల్యాండ్ ఉందని ప్రభుత్వానికి స్వాదీనం చెయ్యాలని రెవిన్యూ డిపార్ట్మెంట్ డిమాండ్ చేసింది. హరిజనుల గిరిజనుల భూమిని మీరు ఆక్రమించుకుంటే మీ నుండి స్వాదీనం చేసుకునే పరీస్థితి ఏర్పడింది.....
మీరు చంద్రబాబు కలసి ఈ రాష్ట్ర ప్రగతికి విగాతం కల్గిస్తున్నది నిజం కాదా ... ఈ మూడు సంవత్సరాలలో కొన్ని వేల పరిశ్రమలు మూత పడితే మీ కళ్ళకి కనపడలేదు.. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి రామోజీరావు,చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్ని ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్ కాకుండా ఎంప్లాయిమెంట్ జెనరేట్ కాకుండా చేస్తున్నారు... 3లక్షల చిన్న పరిశ్రమలు మూతపడే పరీస్థితి వచ్చింది... వేలాదిమంది కార్మీకులకు ఉద్యోగం లేకుండా పోయింది... రామోజీరావు గారి మార్గదర్శి చిట్ ఫండ్ లో రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ని వ్యతిరేకించి ఆర్టికల్ 45ని దిక్కరించి వేల కోట్ల రూపాయలు దిపాజిత్బ్ తీసుకున్న కేసులో ఇప్పటిదాకా ప్రభుత్వం ఎందుకు మాట్లాడకుండా ఉన్నది... 106కోట్ల రూపాయలు ఇన్కం ట్యాక్స్ పేమంట్ చేయాలని ఇన్ కంటాక్స్ చీఫ్ కమీషన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ఈ రోజు దాక పేమంట్ చేయలేదంటే ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకుయ్ మిన్నకుండింది... చిదంబరం చంద్రబాబు ఒప్పందంని బయటకు చెప్పవలసిన అవసరం ఉంది.. ఈ రాష్ట్రం లో ఉద్యోగాలుండవు,కరెంటు ఉండదు శాంతి భద్రతలు ఇవన్ని చంద్రబాబుకి గాని రామోజీరావుకి గాని పట్టవు. రామోజీరావు ఇచ్చిన సలహా మేరకు చంద్రబాబుకి రెండుసార్లు పదవికి దూరం అయ్యాడు. మీరు ఎన్ని తప్పుల రాతలు రాసిన రాజశేఖర్రెడ్డి గౌరవాన్ని రాజశేఖర్రెడ్డి గారిపై ప్రజలుకున్న విశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ ని ఎత్తి పరీస్థితిలో మీరు మార్చలేరు. మీ రాతలకు ఎవరూ మారరు. రాజశేఖర్రెడ్డి గారు మరణించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రాలేదు.

Back to Top