స్పీకర్‌: గట్టు రామచంద్రరావు- మే 28,2012

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు అయిన వెల్లాలా రామ్మోహన్‌ ని అతని తో పాటు మరికొందరిని అరెష్ట్‌చేసి బస్‌లు తగులబెగుతున్నారని బలవంతంగా కొట్టి ముఖ్యమైన నలుగురు పేర్లు చెప్పమని చెప్పి ముందే ఒక దృషప్రచారం చేసారు. జగన్‌మోహన్‌రెడ్డి గారు శాంతియుతంగానే తన దీక్షలుగాని కార్యక్రమాలు చేసారు. ఈప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది అంటే కనీస న్యాయ సూత్రాలు కూడ పాటించడంలేదు. గ్రామ స్ధాయి నాయకులనుండి  రాష్ట్ర నాయకులను అరెష్ట్‌ చేస్తున్నారు. ప్రజలు స్వచ్చందంగా నిరసనచేస్తున్నారు. ఉప ఎన్నికలని వాయిదా వేయడానికే ఈ కుట్ర జరుగుతుంది, జగన్‌మోహన్‌రెడ్డిని ప్రచారంలో మాట్లాడకుండా చేయడానికే ప్రయత్నంచేస్తున్నారు.ముఖ్యమైన నాయకులు ఉప ఎన్నికల్లో పోటిచేస్తున్న 8 మందిని అయిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి,మొదలగు వాళ్ళు అలాగే స్పోక్స్‌పర్స్‌న్‌ అయిన అంబటిరాంబాబు, జూపూడి ప్రభాకర్‌ లాంటి నాయకులను హౌస్‌ అరెష్ట్‌చేసారు. సురేఖగారి భర్త కొండా మురళిని హౌస్‌ అరెస్ట్‌చేసారు. అలాగే వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవా  అధ్యక్షురాలు అయిన విజయమ్మ గారు జగన్‌మోహన్‌రెడ్డిగారిని పరామర్శించడానికి వెళితే ఆమేను మాజి ముఖ్యమంత్రి భార్యఅని చూడకుండా బలవంతంగా పోలీస్‌ వ్యాన్‌ లో తీసుకెళ్ళి అరెస్ట్‌చేసారు. ఎక్కడా అల్లర్లుచేయలేదు, విద్యంసం  సృష్టించడంలేదు ఎక్కడా అటాంకాలు కలిగించలేదు,మరి ఎందుకు ఈ విధంగా పోలీసులు ప్రవరిస్తున్నారు. ఒక వైపు గ్రామాల్లో వీళ్ళుచేసే అన్యాయాలు ప్రజలకు తెలియకుండా కరెంట్‌, టీవీ కేబుల్‌ వైర్లు కట్‌ చేస్తున్నారు. 18  ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ను గెలిపించడానికి సిధ్దంగా ఉన్నారు. ప్రజాతీర్పు అయిన ఒటు ద్వారానే జూన్‌12 తారీఖునా కాంగ్రెస్‌కు తెలుగుదేశంకి ప్రజలు బుద్దిచెబుతారు. ప్రజలకు కార్యకర్తలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఒక్కటే కోరుతున్నాం అందరు శాంతియుతంగా నిరసనలు తెలియచేయండి. సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ద్వారా విజయమ్మగారిని దీక్షని విరమించాలి అని కొరుతున్నాం....విజయమ్మగారు దీక్ష విరమించిన తర్వాత  ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గోంటారు. రాజశేఖరరెడ్డిగారి మరణం తర్వాత కొన్ని అనుమానాలు మాకు 
ఉన్నాయని తెలియచేసాం. చిత్తూరులో రచ్చబండ జరుగుతాఉంటే హెలికాఫ్టర్‌ ఎక్కవలసిన ముఖ్యమంత్రి 15 నియిషాల ముందుగా ఎందుకు హెలికాఫ్టర్‌ ఎక్కకుండా వెళ్ళిపోయాడు.ఇవి అనుమానాలే ఎవరిమీద నిందలువేయడంలేదు.
Back to Top