రాష్ట్రంలో ఉపఎన్నికలు దగ్గరపడేకొద్ది కాంగ్రెస్ టి.డి.పి. పార్టీలు ప్రజలను ప్రలోభాలుపెడుతున్నారు. టి.డి.పి. కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. కోవూరు ఉపఎన్నికలు రాష్ట్రరాజకీయాలను ఓ మలుపు తిప్పుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, బొత్స సత్యనారాయణ తమ స్థాయిదిగి మాట్లాడుతున్నారు. చివరకు కాంగ్రెస్ మీటింగ్ లకు జనం రాకపోతే రికార్డింగ్ డాన్సులు పెట్టుకొని నడిపించుకోవలసిన పరీస్దితి ఏర్పడింది.ఒక పక్క మహిళా దినోత్సవాలు జరుపుకుంటుంటే మహిళల చేత రికార్డింగ్ డాన్సులు చేయిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడుకి ఒక రకమైన మనుషులు స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి సభలకు జనం రాకపోతే వచ్చినవారిని మందులో ముంచుతున్నారు. ఇటువంటివారందరూ జగన్ మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. పేరుకే ప్రతిపక్షం ఉందిగాని ఎటువంటి ప్రజాసమస్యలను ఎప్పుడు వెలుగులోకి తీసుకురాలేదు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు జగన్ పోబియా సోకింది. జగన్ పేరు తలుచుకుంటే వారికి నిద్రపట్టడంలేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువల కోసం రాజకీయాలు చేస్తుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టారో అని కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారిని అవమానపరిచినందుకు,ప్రజలకు ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ పార్టీని జగన్ మోహన్ రెడ్డి గారు వదిలారు. అందరు పదవుల కోసమే రాజకీయాలు చేస్తారు మీరు ఉపఎన్నికల్లో ఎందుకు పోటీపెడుతున్నారు మీకు పదవులు అవసరం లేదా ?పదవికోసం జగన్ మోహన్ రెడ్డి పార్టీని వదిలారని లగడపాటి అంటున్నారు అది తప్పు అని నేను అంటున్నా. కాంగ్రెస్లో ఉంటె కేంద్రపదవి ఇస్తామని 2014 ఎన్నికలముందుగా సీయం పదవి ఇస్తామని కేంద్రం చెప్పింది. కాన ఆయన తండ్రికిచ్చిన మాటకోసం చనిపోయినవారిని పరామర్శించడానికి ముఖ్యమంత్రి పదవిని గడ్డిపోచలా పక్కనబెట్టిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఒకవేళ అప్పుడే ముక్యమంత్రి పదవి ఇచ్చిన ఓదార్పు వద్దనిఅన్నట్టుఐతే వదులుకుని వెళ్ళేవాడు తప్ప ఆ పదవి కోసం ఉండేవాడు కాదు.పదవులు ప్రజలు ఇవ్వాలి. ఈ కాంగ్రెస్ నాయకుడుగాని తెలుగుదేశం నాయకుడుగాని ప్రజల్లోనుండి పదవులు పొందలేదు. చంద్రబాబునాయుడు వ్యవసాయాన్ని,రైతులను,చేనేతలను అందరిని కోలుకోలేని విధంగా చేశారు. రక్తం మరిగిన తోడేలు లా పదవి కోసం కాచుకుకూర్చున్నాడు. ప్రపంచ బ్యాంకు సీయిఓలా పరిపాలన చేశాడు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆధరణ పధకంకింద 620కోట్ల కుంభకోణం చేశాడు. బీసీ,యస్సీ,యస్టీ లను అందరిని మోసం చేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి,చంద్రబాబు ఉపఎన్నికల్లో రెండవ స్థానం కోసం పోటీపడుతున్నారు. ఫీజ్ రీయంబర్స్ మెంట్ పధకం కింద డబ్బులు చెల్లిచ్చినట్టైతే వరలక్ష్మి ఎందుకు చనిపోయి ఉండేది.310 కోట్ల చేనేతలకు మంజూరు చేసిన ఇంతవరకు అమలు జరగలేదు. ఒక పక్క ముఖ్యమంత్రి రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, మరి 104 ఉద్యోగుల పరీస్థితి ఏంటి? కాంగ్రెస్ ఓ మునిగి పోయే పడవా ఉపఎన్నికల తర్వాత కాంగ్రెస్పార్టీ కాలిగావడం ఖాయం.