స్పీకర్: బాజిరెడ్డి గోవర్ధన్ -ఏప్రియల్04,2012

దివంగత నేత వైఎస్, ఆయన కుటుంభ సభ్యులపై ఎల్లో మీడియా సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రతిరోజూ బురదజల్లుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నేత బాజిరెడ్డి మండిపడ్డారు.అయితే మిగతా పత్రికలు,ఛానల్స్ అందులో ఎందుకు భాగాస్వామ్యులవుతున్నాయో తమకు అర్ధం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

మీడియా ఫై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కి అపారమైన గౌరవం ఉందన్నారు. అయితే కొన్ని జాతీయ పత్రికల్లో కూడా అసత్యకధనాలు రాస్తున్నారని, చంద్రబాబు తొత్హులు కొంతమంది అక్కడ చేరి ఆ పత్రికలని కూడా కలుషితం చేస్తున్నారు. అంతేకాక జగన్ చేసిన తప్పేంటని, ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని మీడియాని ప్రశ్నించారు.

కుంభకోణాలు చేస్తున్న రామోజీ,చంద్రబాబుల గురించి కధనాలు రాయని మీడియా కేవలం జగన్ నే ఎందుకు టార్గెట్ చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆ రెండు పత్రికల్లో ప్రజల్లో పలచన కాకుండా మిగిలిన మీడియా నడుచుకోవాలని సూచించారు.
జగన్ మోహన్ రెడ్డి గారిని ఏ విధం గా అరెస్ట్  చేస్తామంటే సహించేది లేదు. ఏ  విధం గా  అడ్డుకోవాలో  ఆ విధం గా అడ్డుకుంటాం. ప్రజల ద్వారా  న్యాయస్థానాల ద్వారా న్యాయం కోసం వెళతామని తెలియచేస్తున్నాం.

తాజా ఫోటోలు

Back to Top