<strong>కర్నూలు, 14 నవంబర్ 2012:</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారంనాటి షెడ్యూల్‌ను పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటించారు. పాదయాత్ర 29వ రోజు గురువారం ఉదయం షర్మిల పాదయాత్ర రంగాపురం నుంచి ప్రారంభమవుతుంది. అనంతరం చిన్నకడుబూరు మీదుగా కొనసాగుతుంది. అక్కడి నుంచి పెద్దకడుబూరు చేరుకుని బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారని రఘురాం వివరించారు. అనంతరం దొడ్డిమేకల జాతీయ రహదారి మీదుగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. షర్మిల పాదయాత్ర గురువారంనాడు మొత్తం 14.6 కిలో మీటర్లు జరుగుతుందని తలశిల వెల్లడించారు.