నాటి దేవుణ్నేనేడు దెయ్యమంటారా?

భువనగిరి (నల్లగొండ), 5 సెప్టెంబర్‌ 2012 : వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడని కీర్తించిన మంత్రులకు ఆయన మరణం తర్వాత దెయ్యంలా కనిపిస్తున్నారా అని మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ప్రశ్నిం చారు. భువనగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశంలోని ముఖ్యమంత్రులంతా వైయస్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించిన సోనియాగాంధీకి, వైయస్‌ను కాటన్‌ దొరతో పోల్చిన ప్రధానికి ఇప్పుడు తప్పుడు మనిషిగా కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు. తాను ఏ పదవులూ ఆశించడం లేదని, కేవలం జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడానికి, ఆయనకు అవసరమయ్యే సలహాలు, సూచనలు చేయడానికే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు ఉప్పునూతల చెప్పారు.

Back to Top