టీడీపీ పాలనలో అన్ని ఇబ్బందులే


విజయనగరం: టీడీపీ పాలనలో ప్రజలు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు పెనుమత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లిమర్ల మెయిదా జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 
 వైయస్‌ జగన్‌ నాలుగుమార్లు ఈ నియోజకవర్గానికి వచ్చారని చెప్పారు. వైయస్‌ జగన్‌ రాకతో నియోజకవర్గం పులకించిందన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం కాగానే టీడీపీ అరాచకాలను తరిమికొడతామన్నారు. టీడీపీ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డారన్నారు. జననేత సీఎం కాగానే ఈ సమస్యలు తొలగిపోతాయన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కొవ్వాడ గ్రామంలో 40 కుటుంబాలు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుందని చెప్పారు. 
 
Back to Top