<br/><br/><br/> విశాఖపట్నం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గురువారం రద్దయింది. విశాఖలో కురుస్తున్న వర్షం కారణంగా పాదయాత్రకు వీలుకాక పోవడంతో 267వ రోజు ప్రజాసంకల్పయాత్రకు విరామం ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం నేటి ఉదయం రాజన్న తనయుడు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పప్పలవాని పాలెం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ప్రతికూల వాతావరణంలో పాదయాత్ర సాధ్యం కాదని భావించి వైయస్ జగన్ నేడు పాదయాత్రను రద్దు చేసుకున్నట్లు వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.