అలికం క్రాస్‌ నుంచి 321వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

  

శ్రీకాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీ‌కాకుళం జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైయ‌స్ జ‌గ‌న్ 321వ రోజు పాద‌యాత్ర‌ను శనివారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని అలికం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి నైరా, కరిమిల్లిపేట క్రాస్‌, రోణంకి క్రాస్‌, భైరి జంక్షన్‌, కరజడ మీదుగా నర్సన్నపేట నియోజక వర్గంలోకి ప్రవేశించి మడపం, దేవాడి వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తారు. 

వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతోన్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. జ‌న‌నేత దారి పొడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైయ‌స్‌ జగన్‌ను చూసేందుకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపిస్తున్నారు. రాజ‌న్న బిడ్డ‌తో సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు పోటీపడుతున్నారు.


Back to Top