సీమనాయుడు వలస నుంచి వైయ‌స్ పాద‌యాత్ర ప్రారంభం

  
  

  
 విజయనగరం: రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 302వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం కురుపాం నియోజకర్గంలోని సీమనాయుడు వలస శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి బట్లబద్ర, జోగిరాజుపేట, పుతిక వలస, కాటమ్‌ దొర వలస క్రాస్ మీదుగా కురుపం వరకు పాదయాత్ర కొనసాగునుంది. సాయంత్రం కురుపాం వద్ద జరిగే బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు.

వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.

వైయ‌స్‌ జగన్‌ను కలిసిన కొండవీటి జ్యోతిర్మయి..
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి పాదయాత్రలో ఉన్న వైయ‌స్‌ జగన్‌ను కలిశారు. టీటీడీలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని జననేతకు వినతి పత్రం అందజేశారు. టీటీడీ పేరును ధార్మిక సేవా పరిషత్‌గా మార్పు చేయాలని అన్నారు. టీటీడీ పరిధిలోని 25కి.మీ వరకు మద్యం అమ్మకాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని జననేతకు విజ్ఞప్తి చేశారు. 

Back to Top