విశాఖ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జననేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 239వ రోజు వైయస్ జగన్ శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి నర్సీపట్నంలోని మెట్టపాలెం క్రాస్ రోడ్డు, బెన్నవరం మీదుగా నర్సీపట్నం టౌన్ వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం నర్సీపట్నం టౌన్‌లోని కృష్ణాపురం, దుగ్ధ క్రాస్ రోడ్డు, బయ్యపురెడ్డి పాలెం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పున: ప్రారంభమౌతుంది. బలిఘట్టం మీదుగా పాదయాత్ర చేసిన తర్వాత నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. <br/>