కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 20 రోజులు దిగ్వీజయంగా సాగుతోంది. వైయస్ జగన్ పాదయాత్రకు సంబంధించిన 21వ రోజు షెడ్యూల్ ఖారారైంది. బుధవారం ఉదయం 8.30 గంటలకు గోనెగండ్ల మండలం ఎల్.కొండ క్రాస్ రోడ్డు నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 10 గంటలకు గంజిహళ్లికి చేరుకుంటారు. 12 గంటలకు మధ్యాహ్నం భోజనం విరామం ఉంటుంది. 3 గంటలకు తిరిగి పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు బైలుప్పల గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 4.30 గంటలకు బి.అగ్రహారం గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు వైయస్ జగన్ పాదయాత్ర ముగిస్తారు.