ప్రకాశం: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 108వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయస్ జగన్ తన పాదయాత్రను చీరాల నియోజకవర్గం వేటపాలెం శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి అంబేద్కర్ నగర్, దేశాయిపేట, జండ్రపేట, రామకృష్ణాపురం మీదుగా చీరాల వరకు పాదయాత్ర చేయనున్నారు. కాగా జననేత వైయస్ జగన్‌కు ప్రజలు దారి పొడవున జననీరాజనాలు పలుకుతున్నారు.