విశాఖ న‌గ‌రంలో కొన‌సాగుతున్న జ‌న‌నేత పాద‌యాత్ర‌

విశాఖ‌: ప‌్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విశాఖ న‌గ‌రంలో కొన‌సాగుతోంది. మూడు రోజులుగా జ‌న‌నేత విశాఖ‌లో పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. ఇవాళ ఉద‌యం చిన్న వాల్తేరు  కనకమ్మ గుడి సమీపం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 260వ రోజు పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. మంగ‌ళ‌వారం ఉదయాన్నే వేలాది సంఖ్యలో ప్రజలు, అభిమానులు బ‌స చేసే ప్రాంతానికి చేరుకున్నారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభం కాగానే రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున జనం బారులుతీరారు. మహిళలు హారతులు పట్టారు. యువత, అభిమానులు, మహిళలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అందరితో వైయ‌స్‌ జగన్‌ సెల్ఫీలు దిగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైయ‌స్ జగన్‌ నడిచిన దారుల్లో పూలు చల్లి స్వాగతించారు.  
Back to Top