కర్నూలు: ప్రజా సంకల్ప యాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గొడిగనూరు గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ నెల 6వ తేదిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఇవాళ100 కిలోమీటర్ల మైలురాయి చేరింది. కర్నూలు జిల్లా చాగలమర్రి దగ్గర ఆయన పాదయాత్ర 100 కిలో మీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్‌కు చాగలమర్రి వద్ద గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. <br/>