<br/> శ్రీకాకుళం: వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని నందగిరి పేట శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నాదాలపురం, బ్రిడ్జి రోడ్ సెంటర్, చిన్నతండా మీదుగా ఆముదాల వలస, కాలేజ్ రోడ్ వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ఆముదాలవలస వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు. వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావారణం నెలకొంది. వైయస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైయస్ జగన్‌కు కలిసేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు పోటీపడుతున్నారు.<br/><br/>