దువ్వపాలెం క్రాస్ నుంచి 263వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 విశాఖపట్నం : వైఎయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం వైయ‌స్‌ జగన్‌.. పెందుర్తి నియోజకవర్గంలోని దువ్వపాలెం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. జ‌న‌నేత‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. అక్కడి నుంచి ఎస్సార్‌ పురం కాలనీ, దబ్బండ క్రాస్‌, ఎస్ఆర్‌  పురం క్రాస్‌, సత్తరువు వరకు రాజ‌న్న బిడ్డ‌ పాదయాత్ర కొనసాగుతుంది.  భోజన విరామం అనంత‌రం తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. లంచ్‌ క్యాంప్‌ నుంచి బొంతువాని పాలెం, సొంఠ్యాం జంక్షన్‌, దిబ్బడి పాలెం జంక్షన్‌ మీదుగా గుమ్మడివాని పాలెం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది.


Back to Top