గళ్లేపల్లి నుంచి 255వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

విశాఖ‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 255వ రోజు పాద‌యాత్ర గ‌ళ్లేప‌ల్లి నుంచి ప్రారంభమైంది. అక్క‌డి నుంచి రావులమ్మపాలెం క్రాస్‌, ఆదిరెడ్డిపాలెం క్రాస్‌, సబ్బవరం వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగనుంది. సబ్బవరంలో సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో జ‌న‌నేత పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి చిన్నగొళ్లాలపాలెం క్రాస్‌ వద్ద వైయ‌స్‌ జగన్ బస చేస్తారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. 

 
Back to Top