వైయస్‌ జగన్‌ను కలిసిన మహిళలు,కాంట్రాక్ట్‌ ఉద్యోగులు..

శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలుకావడంలేదని, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ప్రజలు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విని జననేత భరోసా ఇస్తున్నారు.  సురక్షిత తాగునీరు లేక ఇబ్బందిపడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.   కాంట్రాక్ట్,జౌట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ కలిశారు. రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెటర్నటీ లీవ్‌లు ఇవ్వడంలేదని ట్రైబర్‌ ఏరియాలో పనిచేస్తున్నా ప్రత్యేక అలవెన్స్‌లు ఇవ్వడంలేదని వివరించారు.
Back to Top