<strong>శ్రీకాకుళం:</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని వడ్డెర కులస్తులమంతా కృషి చేస్తామని సంఘం ప్రతినిధులు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వడ్డెర కులస్తులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో నిలుపుతానని ప్రకటించిన వైయస్ జగన్‌కు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వడ్డెర సంఘాన్ని వైయస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించారు.