టీడీపీ హయాంలో అటవీహక్కు చట్టానికి తూట్లువైయస్ జగన్‌కు గిరిజన రైతులు మొర...విజయనగరంః అల్లువాడ వద్ద వైయస్ జగన్‌ను గిరిజన రైతులు కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. గిరిజన ప్రాంత వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని కోల్డ్‌స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. వైయస్ హయాంలో అటవీహక్కుల చట్టం అమలు జరిగిందని ,తర్వాత చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని రైతులు వాపోయారు.. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. ఇళ్ల పట్టాలు,సాగుభూమి కేటాయించాలని కోరారు.