చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కలిశారు. మూడున్నరేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదని కార్మికుల ఆవేదన. వైయస్ హయాంలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించారని, బాబు అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని మూసేశారని కార్మికులు వాపోయారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని వైయస్ జగన్ కార్మికులకు భరోసా కల్పించారు.