324వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 

 శ్రీకాకుళం : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు వైయ‌స్ జ‌గ‌న్ 324వ రోజు పాదయాత్ర‌ను మంగ‌ళ‌వారం ఉదయం లింగాల వలస నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చల్లవానిపేట, సౌదాం, రేగులపాడు క్రాస్‌, కొప్పాలపేట క్రాస్‌, దుప్పాలపాడు క్రాస్‌, గంగుపేట, కస్తురిపాడు జంక్షన్‌ మీదుగా కొబ్బరిచెట్ల పేట వరకు ప్రజాసంకల్పయాత్ర  కొనసాగనుంది.  

వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతోన్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. జననేతను చూసేందుకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపిస్తున్నారు. జ‌న‌నేత‌తో సెల్ఫీలు దిగేందుకు యువతీ, యువకులు పోటీపడుతున్నారు. 


Back to Top