జ‌మ్ము జంక్ష‌న్ నుంచి 323వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
   

  శ్రీకాకుళం : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు సోమవారం ఉదయం నరసన్నపేట నియోజకవర్గంలోని జమ్ము జంక్షన్‌ నుంచి 323వ రోజు పాదయాత్రను ప్రారంభించారు.  అక్కడి నుంచి టెక్కలిపాడు క్రాస్‌, రావడపేట, చిన్నదుగాం జంక్షన్‌, నారాయణ వలస, రాణ జంక్షన్‌ మీదుగా లింగాల వలస వరకు ప్రజాసంకల్పయాత్ర  కొనసాగనుంది. 

కాగా, వైయ‌స్ జ‌గ‌న్ బ‌స చేసే జ‌మ్ము జంక్ష‌న్ వ‌ద్ద భారీగా ఈదురు గాలులు వీస్తున్న వేలాది మంది జ‌నం త‌మ బాధ‌లు చెప్పుకునేందుకు జ‌న‌నేత వ‌ద్ద‌కు చేరుకున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ, వారికి భ‌రోసా క‌ల్పిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. పాద‌యాత్ర దారుల‌న్నీ జ‌న‌సంద్ర‌మయ్యాయి. రాజ‌న్న బిడ్డ‌కు ఎదురెళ్లి మ‌రీ స్వాగ‌తం ప‌లుకుతున్నారు.  

తాజా వీడియోలు

Back to Top