వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో రోజు ప్రజాసంకల్పయాత్రను వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఉరుటూరు శివారు నుంచి ప్రారంభించారు. గురువారం ఉదయం 8.40 గంటలకు ఆయన నాలుగో రోజు యాత్ర మొదలు పెట్టారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.నాలుగో రోజు యాత్రలో భాగంగా పెద్దనపాడు, వైకోడూరులో జనంతో ఆయన మాట్లాడనున్నారు. ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజు పాదయాత్రలో భాగంగా వైయస్ జగన్ 10.9 కిలోమీటర్లు నడవనున్నారు. ఎర్రగుంట్ల శివారులో ఈరోజు యాత్ర ముగించనున్నారు. ఇప్పటివరకు మూడురోజులు పాదయాత్ర పూర్తి చేసిన ఆయన 39 కిలోమీటర్లు నడిచారు.<br/><br/><br/><br/>