వైయస్ జగన్‌ను కలిసిన విక్రమపురం రజకులు..శ్రీకాకుళంః విక్రమపురం గ్రామ రజకులు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.ఆదరణ పథకం కింద ఎలాంటి పనిముట్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కులవృత్తులు కొనసాగిస్తున్న బీసీ వర్గాల వారికి ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చి ఆదుకుంటామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని కాని వాస్తవానికి ఒక ఇస్త్రీపెట్టె కూడా అందలేదన్నారు..అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. బట్టలు ఉతుకోవడానికి చెరువు కూడా లేదన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.రజకులకు పింఛన్లు కూడా ఇవ్వడంలేదని వాపోయారు.పథకాలు అన్ని ప్రచారాలకే పరిమితం అయ్యాయన్నారు. వైయస్ జగన్ సీఎం అయితే అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయనే నమ్మకం వుందన్నారు.